ఆ పాటకు రీల్ చేయండి...గిఫ్ట్ కొట్టండి...భోలే షావలి బంపర్ ఆఫర్
"అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క" అనే జానపద గీతం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు . ఈ పాటను రాసి, పాడి, కొరియోగ్రాఫ్ చేసింది భోలే షావలి ..అతనికి జంటగా శుభశ్రీ రాయగురు కూడా పోటీగా డాన్స్ చేసింది. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గా అదరగొట్టారు. ఈ మధ్య కాలంలో కొత్త కవర్ సాంగ్స్ ని, ఫోక్ సాంగ్స్ ని, మూవీ సాంగ్స్ ని జనాల్లోకి తీసుకెళ్లి మంచి రేటింగ్స్ సంపాదించడం కోసం కొన్ని కాంటెస్టులు పెడుతూ ఉంటారు.