English | Telugu

కుర్చీ మడతపెట్టిన కొత్తపెళ్ళికొడుకు

కుర్చీ తాత కుర్చీ మడతపెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియా మొత్తం కూడా కుర్చీ మడతపెడుతూనే ఉంది. కుర్చీ పాట ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సాంగ్ ని థమన్ గుంటూరు కారం మూవీలో పెట్టి ఇరగదీసే కూతలతో సాంగ్ ని కంపోజ్ చేసాడు. ఆ సాంగ్ మ్యూజిక్ కి అందరికీ ఊపొచ్చేసి సోషల్ మీడియాలో కుర్చీ ఫీవర్ తో ఊగిపోతున్నారు చిన్నా పెద్ద సెలబ్రిటీస్ అంతా. ఈ పాటకి మహేశ్ బాబు-శ్రీలీల వేసిన స్టెప్పులు అద్దిరిపోయాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది, కూతపెట్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీ ఒక్కరూ ఈ పాటకి స్టెప్పులేస్తూ రీల్స్ షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ పాటకి బ్రహ్మముడి సీరియల్ హీరో, బిగ్‌బాస్ ఫేమ్, కొత్త పెళ్ళికొడుకు మానస్ నాగులపల్లి కూడా అదిరిపోయే స్టెప్పులేశాడు. ఢీ డ్యాన్సర్, యూట్యూబర్ శ్వేత నాయుడితో కలిసి మాస్ డ్యాన్స్ చేసి కేకపెట్టించాడు. శ్రీలీల వేసిన సేమ్ ఔట్‌ ఫిట్‌లో శ్వేత నాయుడు ఓ ఊపు ఊపేసింది. మానస్ హీరో మెటీరియల్ మాత్రమే కాదు మంచి డాన్స్ మెటీరియల్ అని ఇప్పటికీ ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఈ మాస్ బీట్‌కి రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశాడు. వీళ్ళ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్‌తో బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరైన మానస్ కార్తీక దీపం, కోయిలమ్మ సీరియల్స్‌ నటించాడు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక బ్రహ్మముడి సీరియల్ ద్వారా మానస్ కెరీర్ మంచి సక్సెస్ రూట్ లో దూసుకుపోతోంది. ఇదే టైంలో మూవీస్ లో కూడా ఛాన్సెస్ వస్తున్నాయని వాటి గురించి త్వరలో అనౌన్స్ చేస్తానని కూడా ఒక షోలో చెప్పాడు. ఇప్పటికే హీరోగా కూడా కొన్ని సినిమాలకి సైన్ చేసినట్లు చెప్పాడు మానస్. అలాగే జరీ జరీ పంచెకట్టు కవర్ సాంగ్ తో మానస్ చాలామంది ఆడియన్స్ కి ఫ్యాన్ గా మారిపోయాడు.