ఇన్ స్టాలో బోరాన్ అంటున్న ఆరోహి!
సోషల్ మీడియాలో కొత్త ట్రెండింగ్ నడుస్తోంది. మార్కెట్ లోకి కొత్త సరుకు వచ్చిందన్నట్టుగా ఇన్ స్టాగ్రామ్ లోకి కొత్తగా బోరాన్ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో నిన్న మొన్నటిదాకా బిగ్ బాస్ ట్రోల్స్, మీమ్స్ అండ్ రీల్స్ తో బిజీగా ఉన్ నెటిజన్లు ఇప్పుడు నయా ట్రెండింగ్ ని ఫాలో అవుతున్నారు. అయితే సాధారణంగా ఎక్కడో ఒక్క దగ్గర జరిగిన కొన్ని సంఘటనలని తీసుకొని రీల్స్ చేస్తుంటారు. అయితే కరీంనగర్ లోని ఓ షాప్ లో కొత్తగా మొదలైన డ్రెస్ ల గురించి వివరిస్తూ ఒకతను మాటకి ముందు బోరాన్, మాట తర్వాత బోరాన్ అంటు రీల్ చేయడం .. అది ఆ నోట ఈ నోటా పడి ఇన్ స్టాగ్రామ్ లో సెలెబ్రిటీలంతా ఫాలో అయ్యేదాకా వచ్చింది.