వాళ్ళిద్దరి ప్రేమ విషయం చెప్తానని చెప్పిన ముకుంద!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -249 లో.. కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన మధు గట్టిగా అరుస్తాడు. అది విని భవాని.. ముకుంద తన ప్రేమ గురించి ఈ గదిలో చూస్తే తెలుస్తుందని కూడా పట్టించుకోకుండా, కృష్ణ, మురారీల దగ్గరికి వెళ్తుంది. మురారి తలకి ఉన్న కట్టు చూసిన భవాని.. మురారికి ఏమైందోనని కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, ఏమైందని అడుగుతుంది. అప్పుడు కృష్ణ జరిగిందంతా భవానికి చెప్తుంది.