English | Telugu
ఎన్ని విజిల్స్ వస్తే పప్పు ఉడికినట్టు...వరుణ్ తేజ్ ని అడిగిన ఉదయభాను
Updated : Jan 30, 2024
జీ తెలుగులో సూపర్ జోడి షో మంచి హాట్ అండ్ స్వీట్ పెర్ఫార్మెన్సెస్ తో స్టార్ట్ ఐపోయింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో మున్నా - హర్షల, మేఘన - మహేష్, కరం- డాలీ, సంకేత్-శ్రీసత్య అనే నాలుగు జంటలు వచ్చి పెర్ఫార్మ్ చేశాయి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కే కొత్త పెళ్ళికొడుకు మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్ ని షోకి సెలబ్రిటీ లుక్ కోసం, టైటిల్ లోగోని చూపించడం కోసం ఇన్వైట్ చేశారు మేకర్స్. ఇక హోస్ట్ ఉదయభాను ఆయన లవ్ స్టోరీతో పాటు ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. "నేను లావణ్య మొదట ఫ్రెండ్స్ గా స్టార్ట్ అయ్యాం తర్వాత కొంత మెచ్యూరిటీ వచ్చాక పెళ్లి చేసుకోవడం ఒక బెస్ట్ స్టెప్ అనిపించింది.
ఇద్దరం కలిసి ఫామిలీస్ కి చెప్పాం వాళ్ళు కూడా ఓకే అన్నారు. నా ప్రకారం మెగా ఫామిలీ సూపర్ జోడి ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి- సురేఖ గారు." అని చెప్పాడు. "మరి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు ఫామిలీ మ్యాన్ అయ్యారు కదా ఎంత వరకు ఫామిలీ మ్యాన్ అయ్యారో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా...కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే పప్పు ఉడికినట్టు" అని అడిగింది దానికి "మూడు విజిల్స్ అనుకుంటున్నా" అని వరుణ్ తేజ్ అనేసరికి జడ్జి మీనా గారిని అడుగుదాం ఈ విషయం అంది ఉదయభాను. "పప్పుకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందనుకుంటా ఎందుకంటే పప్పు కొంచెమే వేస్తాం కదా" అంది మీనా "పోనీ కప్పు పప్పులో ఎన్ని నీళ్లు పోయాలో తెలుసా" అని ఉదయ భాను అడిగేసరికి "పోయి కుక్కర్ ని అడగండి" అంది జడ్జి శ్రీదేవి ఫన్నీగా . తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి చిరంజీవి మూవీ సాంగ్ కి స్టెప్స్ వేసింది మీనా. అలాగే వరుణ్ తేజ్ నటించిన "ఆపరేషన్ వాలెంటైన్" మూవీ టీజర్ వేసి చూపించారు. అలాగే ఈ మూవీలో సాంగ్ పాడిన కునాల్ ని కూడా ఈ షోకి ఇన్వైట్ చేశారు. ఇక సూపర్ జోడి టైటిల్ ని రివీల్ చేసి కంటెస్టెంట్స్ కి విషెస్ చెప్పారు వరుణ్ తేజ్.