English | Telugu

అమ్మతోడు అద్భుతమైన మనిషివే నువ్వు : భోలే షావలి!


బూట్ కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ లో పాల్గొన్నాడు భోలే షావలి. ఈ సినిమాలో భోలే పాట పాడాడంట అదే విషయాన్ని భోలే స్ఫీచ్ లో చెప్పాడు. సో హెల్ నుండి‌ వచ్చాడు. ఇప్పుడు సో హెవెన్ గా మారుతున్నాడు. వేదికముందు ఉన్న ఎంతో మంది ప్రముఖులకు నా కళాభివందనాలని భోలే షావలి చెప్పాడు. భోలే పాడిన ఆ పాటని దేవ్ పవర్ రాసాడని చాలా పవర్ ఫుల్ గా రాసాడాని చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ సీజన్-1 నుండి సీజన్-7 వరకు ఉన్న ప్రతీ ఒక్కరు నీకు సపోర్ట్ గా ఉంటారు. అమ్మతోడు అద్భుతమైన మనిషివే నువ్వు.. చాలామంచి మనసున్న వ్యక్తి సోహెల్. ఆయన తర్వాత ఆ పేరు నాకొచ్చిందంటూ భోలే షావలి అన్నాడు. మరి హీరోగా ఎప్పుడు చేస్తున్నారని యాంకర్ సుమ అడుగగా.. భోలే అంటే హీరో.. హీరో అంటే భోలే.. మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు అంటూ పాట పాడాడు‌. సుమగారి నోటి వెంట నన్ను హీరో అనడం ఎంత కమ్మగా ఉందోనని భోలే షావలి అన్నాడు. బూట్ కట్ బాలరాజు సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని భోలే షావలి అన్నాడు. ఇక హీరో సోహెల్ మాట్లాడతూ.. భోలే అన్నకి షూటింగ్ ఉన్నా నేను పిలిచానని నాకోసం వచ్చాడు‌. థాంక్స్ సో మచ్ అన్న అని అన్నాడు. ఓ సినిమా ఫంక్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ని గెస్ట్ గా పిలవడం.. మరో‌ బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరోగా ఉండటంతో తెలుగు బిగ్ బాస్ అభిమానులకి కన్నులపండుగలా అనిపించింది. ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ వారికుంటారనేది మరోసారీ నిరూపించాడు భోలే షావలి. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, నయని పావని, పూజామూర్తి, అశ్వినిశ్రీలతో పాటు భోలే షావలి వచ్చాడు. వచ్చీ రాగానే నామినేషన్ లో సీరీయల్ బ్యాచ్ పై విరుచుకుపడ్డాడు భోలే. వాళ్ళు చేసే గ్రూపిజం గురించి వారితో ధైర్యంగా చెప్పి ఇన్ స్ట్రాగ్రామ్ లో ట్రోల్స్ చేసే పేజీలకు కంటెంట్ ఇచ్చాడు. పాటబిడ్డ పేరుకి న్యాయం చేసాడు భోలే షావలి. సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ జైలుకెళ్ళినప్పుడు లాయర్లతో వెళ్లి బెయిల్ వచ్చేలా చేసి తనకి సపోర్ట్ గా నిలిచాడు భోలే షావలి. దీంతో రియల్ హీరో అని విమర్శకుల చేత అనిపించుకున్నాడు. భోలే పాటలు యూట్యూబ్ లో ఎంత ఫేమసో అందరికి తెలిసిందే.