సింగర్ గీతా మాధురి సీమంతం...వైరల్ అవుతున్న పిక్స్
టాలీవుడ్ స్టార్ సింగర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతామాధురి మరో సారి అమ్మ కాబోతోంది. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆల్రెడీ గీతా-నందు జంటకు దాక్షాయనిప్రకృతి అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రాబోతోందని డిసెంబర్‌లో చెప్పింది గీతా మాధురి. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, గీత ఫ్రెండ్స్, వెల్ విషర్స్ మధ్య ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందమైన పట్టు చీరలో మెరిసిపోయింది గీతా మాధురి. సీమంతం చేసే వేదికను కూడా అందంగా ముస్తాబు చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో గీతా మాధురి రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.