English | Telugu

చందమామతో శ్రీసత్య చేసిన వీడియో వైరల్!

చందమామతో ఫోటోషూట్ మాములుగా లేదుగా.. అవును నిజమే. అంజలి పవన్ కూతురు చందమామ చూడటానికి అచ్చం బాపుబొమ్మలా ఉంటుంది. ఆ పాప ఫోటోషూట్ ని ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే మిలియన్లలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆ పాపతో బిగ్ బాస్ భామ శ్రీసత్య ఓ ఫోటోషూట్ చేసింది‌. దానికి సంబంధించిన ఓ వీడియోని శ్రీసత్య తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

బిగ్‌బాస్‌ బ్యూటీల్లో అదిరిపోయే గ్లామర్ ఉన్న వాళ్లలో శ్రీసత్య ఒకరు. విజయవాడకు చెందిన శ్రీసత్య.. మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విజేతగా నిలిచింది. 'నేను శైలజ', ‘లవ్ స్కెచ్’, 'గోదారి నవ్వింది' వంటి సినిమాల్లో శ్రీసత్య నటించింది. ‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అర్జున్ కల్యాణ్‌ను తన వెనక తిప్పుకుంటూ శ్రీసత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక బయటకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది శ్రీసత్య. క్యూట్ ఫొటోషూట్‌లతో నెటిజన్ల హృదయాలకు గాలం వేస్తుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన గ్లామర్ తో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ భామ.. అ తర్వాత మొదలైన 'బిబి జోడీ' డ్యాన్స్ షోలో మెహబూబ్ తో కలిసి ఎన్నో హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ లు ఇచ్చింది. ఇక తాజాగా జీతెలుగులో మొదలైన 'సూపర్ జోడీ' డ్యాన్స్ షోలో సాకేత్ తో కలిసి హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. ‌దీంతో శ్రీసత్య మరోసారి వార్తల్లోకి వచ్చేసింది.

బిగ్‌బాస్ భామల్లో చాలా మంది హాట్ షో మీదే ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తుంటారు. కానీ శ్రీసత్య మాత్రం ట్రెడిషనల్ లుక్‌లో ఫొటోలు పెడుతూ క్లాసిక్ టచ్ ఇస్తుంది. ఈ మధ్య అయితే వరుసగా శారీ, లెహంగాలో ఈ బ్యూటీ పెట్టిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. చందమామతో కలిసి కుందనుపు బొమ్మల్లా ఇద్దరు అలా నడిచొస్తుంటే నెటిజన్లు ఫిధా అయ్యారంతే. చిన్న సినిమాలోని నా అమ్మ నీవేలా.. నా బొమ్మ నీవేలా అనే పాటకి రీల్ చేశారు. సేమ్ డ్రెస్ సేమ్ లుక్స్.. ఇద్దరు పిల్లల్లా అనిపించే ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ముప్పై ఒక్క మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.