English | Telugu

నెగెటివ్ కామెంట్లు చేసేవారికి గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్ కౌంటర్!

జీవితంలో ఏది ఒకరి సొంతం కాదు. నటించేవాళ్ళకి తమ పక్కన ఉన్నది చిన్న ఆర్టిస్ట్ అయిన తక్కువ చూడకడదు. అదే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ చెప్పాడు. అసలేం జరిగిందంటే.. డాక్టర్ బాబు , నయని పావని కలిసి ' తెలియదే' అనే కవర్ సాంగ్ కి డ్యాన్స్ చేశారు.‌ అయితే ఇదే పాటకి యావర్ తో కలిసి నయని పావని నాలుగు రోజుల క్రితం ఓ పర్ఫామెన్స్ చేసి తన ఇమ్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది‌. ఇక నిన్న గౌతమ్ కృష్ణతో అదే పాటకి కలిసి పర్ఫామెన్స్ చేసింది.

నయని పావని, యావర్ ల పర్ఫామెన్స్ బాగుందని కొన్ని వేల కామెంట్లు రాగా.. ఇప్పుడేమో నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. యావర్ ని ఎందుకు వదిలేశావ్? యావర్ తో చేసిన వీడియో ఎందుకు డిలీట్ చేశావ్? ఈ అశ్వగంధ 3.0 తో ఎందుకు చేశావ్? అంటు కామెంట్లు వస్తున్నాయి. అలాంటి కొన్ని కామెంట్లకి నయని పావని ఘాటుగా సమాధానమిచ్చింది. నేను చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ని ప్రమోట్ చేసుకుంటున్నానని నయని పావని రిప్లై ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో పది వారాల పాటు ఉన్న గౌతమ్ కృష్ణ.. తన ఆట తను ఆడకుండా సీరియల్ బ్యాచ్ చెప్పినట్లు చేశేవాడు. ఆ తర్వాత ఎలిమినేషన్ అంటూ సీక్రెట్ రూమ్ కి పంపించి మళ్ళీ 2.0 గా తిరిగి హౌస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత శివాజీని టార్గెట్ చేయడంతో ప్రేక్షకులలో తీవ్ర నెగటివిటిని సొంతం చేసుకున్నాడు. దాంతో ఎలిమినేట్ అయ్యాడు. ఇక బయటకొచ్చాక శుభశ్రీ రాయగురు, ప్రియాంకతో కలిసి వ్లాగ్స్ చేయగా ఇప్పుడు నయని పావనితో కలిసి ఓ కవర్ సాంగ్ చేశాడు. దానికి పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు వచ్చాయి.

నెగెటివ్ కామెంట్లు చేసేవారందరికి ఓ కామెంట్ పెట్టాడు గౌతమ్ కృష్ణ.. అందులో ఏం చెప్పాడంటే.. మచ్చా అందరికి ఒక విషయం చెప్తా.. బేసిక్ గా నేను నెగెటివిటికి ఎక్కువ రియాక్ట్ కాను బట్ అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమె నాకు ఒక మంచి స్నేహితురాలు. మేమంతా యాక్టర్స్ మనిషితోనైనా బొమ్మతోనైన అదేరకంగా పీల్ అయ్యి యాక్ట్ చేస్తాం. ఇల దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పు మచ్చా. నేను ఏదైన అంటే తీసుకోగలుగుతా కానీ అందరు అలా తీసుకోరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరు మనుషులే.. ఎవరి లైఫ్ వాళ్ళిష్టం. అర్థం చేస్కోండి. మీరేమన్నా కానీ ఒకరి క్యారెక్టర్ మారిపోదు. మేము మంచి స్నేహితులం. నెగెటివ్ గా మాట్లాడేవాళ్ళు మీ లైఫ్ ని మీరు సరిగ్గా చూసుకుంటే ఇంకా బాగుపడతారు. జై హింద్ అని గౌతమ్ కృష్ణ కామెంట్ చేశాడు. దీంతో యావర్ ఫ్యాన్స్ కి గౌతమ్ కృష్ణకి మధ్య చిచ్చు మొదలైనట్టుగా తెలుస్తోంది. మరి బిగ్ బాస్ హౌస్ లో లాగా బయట కూడా ఒకరినొకరు దూషించుకుంటారా.. ఈ ఇష్యూ ఎక్కడి వరకు సాగుతుందో చూడాలి మరి.