English | Telugu

అనంత్ శ్రీరామ్ పై ఫైర్ ఐన మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్!

సూపర్ సింగర్ షోలో అనంత శ్రీరామ్ మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ ఈగోని హర్ట్ చేస్తూ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈవారం శనివారం ఎపిసోడ్ ఫుల్ కూల్ గా జరిగితే ఆదివారం ఎపిసోడ్ లో కాస్త రచ్చ జరిగింది. లేడీ కంటెస్టెంట్ అక్షయసాయి పాడిన సాంగ్ ని విన్న జడ్జి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ " ఎక్స్ప్రెషన్ ప్రకారం తప్పు పట్టడానికి ఏమీ లేదు..కానీ టెక్నికల్ గా కొన్ని మిస్టేక్స్ చేసావు...నీ పక్కన ఉన్న ప్లే బ్యాక్ సింగర్ హరిణి గారిని చూసి ఇంకా బాగా పాడడానికి ట్రై చెయ్యి" అని ఆమెకు సలహా ఇచ్చారు. ఇక స్కోర్స్ విషయానికి వస్తే ఏ వివాదాలు లేవు అన్నారు.

మరి శ్వేతా గారు 7 మార్క్స్ ఇచ్చారు అని శ్రీముఖి అనేసరికి " సంగీతం మీద శ్వేతా గారికి పూర్తి సాధికారత ఉంది కాబట్టి" అని ఆన్సర్ ఇచ్చేసరికి "ఐతే మంగ్లీ, రాహుల్ కి సంగీతం మీద సాధికారత లేదా" అని రివర్స్ లో అడిగింది శ్రీముఖి. " ధైర్యంగా చెప్పాలి అంటే శ్వేతా గారితో పోలిస్తే వీళ్లద్దరికీ అంత లేదు" అని చెప్పారు అనంత శ్రీరామ్. దాంతో మంగ్లీ, రాహుల్ ఇద్దరూ ఫైర్ అయ్యారు. "ఇది మ్యూజిక్ నాలెడ్జి గురించి కాదు. స్టేజి మీద ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేది ముఖ్యం. ఈ వేదిక మీదకు నేర్చుకోకుండా రాలేదు సర్...మీరు అలా మాట్లాడకూడదు..దాన్ని కించపరచడం అంటారు" అని మంగ్లీ, రాహుల్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చారు.."టాలెంట్ అంతా నిరూపించాలి అంటే పరీక్ష పెట్టాలి" అన్నాడు అనంత శ్రీరామ్ " పరీక్షలు మీ ఇంట్లో పెట్టుకోండి. అసలు దీనికి పరీక్ష ఎందుకు అది పరంపర...నేను, రాహుల్ ఇండిపెండెంట్ గా నేర్చుకుని, ప్రాక్టీస్ చేసి వచ్చాము.." అని చెప్పారు ఇద్దరూ. ఇక ఫైనల్ గా మార్కుల విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని ఆ కౌంటర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు అనంత శ్రీరామ్.