Pallavi Gowda:పల్లవి గౌడకి ఓ అభిమాని లేఖ.. ఫిధా అయింది!
సినిమా హీరో, హీరోయిన్ లకి ఏ రేంజ్ లో అభిమానులుంటారో కొన్ని బుల్లితెర సీరియల్స్ లోని హీరో, హీరోయిన్ లకి అదే రేంజ్ లో అభిమానులుంటారు. వేద-యష్ ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే బ్రహ్మముడి రాజ్-కావ్య, గుప్పెడంత మనసులోని రిషి-వసుధార, కృష్ణ ముకుంద మురారీలకి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. అయితే వీటితో పాటు త్రినయనికి, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అంతే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది నిండు నూరేళ్ళ సావాసం హీరోయిన్ పల్లవి గౌడ.