భూమి తల్లి శపిస్తోంది...ఇకనైనా మన ఆరోగ్యం కాపాడుకుందాం
ఒకప్పుడు మనమంతా పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళం...పంటలు పండించుకుని ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ ని తినేవాళ్ళం..అందుకే మన తాతలు, బామ్మలు 90 ఏళ్ళు వచ్చినా కూడా నడుములు ఒంగకుండా, కళ్ళజోడులు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక్క మందుబిళ్ల కూడా వేసుకోకుండా ఏళ్లకేళ్లు బతికారు. కానీ తర్వాత తరం మారింది. గడిచిన ఈ ఇరవై ఇళ్లల్లో పంటలు, పొలాలు, రైతులు, ప్రజలు, తిండి, తిప్పలు, విధానాలు, రోగాలు ఇలా అన్నిట్లో భయంకరమైన మార్పులు వచ్చాయి.. ఆర్గానిక్ ఫుడ్ కాస్తా పోయి విషం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పుట్టిన వాళ్లకు చూపు లేకుండా, క్యాన్సర్స్ తో, రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో బతుకుతున్నారు చాలా మంది. ఇలాగే ఇంకొన్నేళ్లు ఉంటే మనుషుల మీద కొత్త కొత్త రోగాలు దాడి చేసి మరణాల రేట్ పెరిగిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది.