రోహిణిని బర్రెతో పోల్చిన బులెట్ భాస్కర్
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి రౌడీ రోహిణి, బులెట్ భాస్కర్, నాటీ నరేష్, వర్ష, ఇమ్మానుయేల్, తాగుబోతు రమేష్ వచ్చారు. ఈ వారం షోకి రిట్రో థీమ్ గెటప్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. బులెట్ భాస్కర్ కొడుకుగా నటించాడు నాటీ నరేష్. "నాన్నగారు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను" అని నరేష్ చెప్పేసరికి "మావయ్యగారు ఆశీర్వదించండి" అంటూ రౌడీ రోహిణి భాస్కర్ కాళ్ళ మీదకు వంగింది. "పెళ్లి చూసుకున్నావా సంతకి వెళ్లి బర్రెను కొన్నావా" అనేసరికి నరేష్, రోహిణి షాకయ్యారు. "దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అని కండిషన్ పెట్టాడు భాస్కర్.