English | Telugu
సోహైల్ బిగ్ బాస్ కి రాడు..అసలు ఓటిటి సీజన్ ఉంటుందా ఉండదా ?
Updated : Jan 30, 2024
బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటిటి వెర్షన్ కి కొంతమందిని మేకర్స్ వెళ్లి కలిశారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి సంబంధించి అఫీషియల్ పేజీ ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. "బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి సోహైల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా" అని అడిగితే "చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా మూవీస్ తీసుకుంటున్నాడు..ఇప్పుడెందుకు వస్తాడు" అని ఆన్సర్ ఇచ్చారు. "ఇంతకు బిగ్ బాస్ ఎవరు" అని అడిగేసరికి "డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధ కృష్ణ" అని ఆన్సర్ ఇచ్చారు.
రాధా కృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుండి వాయిస్ ఇస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ ఓటిటి సీజన్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంటుందా లేదా అనే పెద్ద డౌట్ అందరిలో ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 లో జరిగిన రచ్చ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అందులోనూ బిగ్ బాస్ షో టీవీ సీజన్ కి వస్తామని చెప్తున్నారు కానీ చాలామంది ఓటిటి సీజన్ కి రావడానికి ఎవరూ పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఓటిటి స్టార్ట్ అవుతుంది అని గత నెలలో హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో ఇంకా దానికి సంబంధించిన అప్ డేట్స్ ఏమీ బయటకు రావడం లేదు. బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 లో బిందు మాధవి విన్నర్ అయ్యింది కానీ ఈ సీజన్ కి అనుకున్నంత రేటింగ్ ఐతే రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కి అద్భుతమైన రేటింగ్ రావడంతో పాటు ఆడియన్స్ లో బిగ్ బాస్ అంటే ఆసక్తి పెరిగేలా చేసింది. కానీ తర్వాత సీజన్ నుంచి గొడవలు బాగా జరగడం స్టార్ట్ అయ్యాయి. అలాగే హోస్ట్ కూడా పెద్దగా ఆసక్తి లేకుండా ఎక్కువ కంటెంట్ ని ఆడియన్స్ కి ఇవ్వకుండా ఏదో మొక్కుబడిగా చేస్తూ వస్తున్నారు. దాంతో ఇన్ని సీజన్స్ నడిచాయి కానీ వాటికి పెద్దగా రేటింగ్ ఐతే రాలేదు. మరి ఓటిటి సీజన్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.