యాదమ్మ రాజును కేటరింగ్ బాయ్ గా చేసేసిన స్టెల్లా
యాదమ్మ రాజు-స్టెల్లాకు బుల్లితెర మీద, సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు యాదమ్మ రాజు బర్త్ డే వేడుకలను స్టెల్లా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. యాదమ్మ రాజు కోట్ వేసుకుని ఈ సెలెబ్రేషన్స్ లో కనిపించాడు. పుట్టిన రోజు అని చెప్పి కేటరింగ్ బాయ్ ని చేసేసింది తన భార్య అంటూ ఫీల్ అయ్యాడు. ఇక తర్వాత రౌడీ రోహిణి, పవిత్ర వచ్చి నిజంగా కేటరింగ్ బాయ్ ని చేసేసి కావాల్సిన ఫుడ్ తెమ్మంటూ యాదమ్మ రాజును ఆట పట్టించారు. ఇక రాజు బర్త్ డే ఫంక్షన్ కి హిమజ, రోహిణి, సద్దాం, పవిత్ర, జ్ఞానేశ్వర్, టేస్టీ తేజ, జబర్దస్త్ ఇమ్మానుయేల్, బాబు వచ్చారు.