English | Telugu
రోహిణిని చూస్తే మూడ్ రావట్లేదు..మగాడినన్న ఫీలింగ్ అప్పుడే గుర్తొచ్చింది
Updated : Jan 30, 2024
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షోలో బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉంటాయో చేసి చూపించారు సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇక ఫస్ట్ రౌండ్ లో నాగ పంచమి సీరియల్ హీరో పృద్వి శెట్టితో కలిసి రోహిణిని డాన్స్ చేయమని చెప్పింది శ్రీముఖి. రోహిణి తెగ డాన్స్ వేసింది కానీ పృద్వి మాత్రం దూరంగా ఉంటూ వచ్చాడు. "ఏదో బొమ్మను పట్టుకుని డాన్స్ చేస్తున్నట్టు ఉంది అరేయ్ అవినాష్ నువ్వు రారా డాన్స్ చేద్దాం అనేసరికి ఆమ్మో నాకు మూడ్ లేదండి" అని డైలాగ్ వేసేసేసరికి తెగ ఫీలైపోయింది రోహిణి.. తర్వాత షోలో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ సెగ్మెంట్ ని చేయమంటూ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి.
నాగపంచమి సీరియల్ హీరో పృద్వి శెట్టి శోభా శెట్టిని నామినేట్ చేసాడు. "శోభా చాలా డల్ గా ఉందని నామినేట్ చేసాను ఇలా ఉంటే ఆడియన్స్ కి చాలా బోర్ కొడుతోంది కదా..శోభా శెట్టి అస్సలు నచ్చడం లేదు పంపించేయండి అన్నాడు పృద్వి. సరే నేను డల్ గా ఉన్నా.. నీ పాయింట్ ఓకే కానీ నువ్వేం చేసావ్ రోహిణి వచ్చి నీతో డాన్స్ వేస్తే నువ్వేసావా..లేదు కదా అని అడిగింది. రోహిణి నాకు నచ్చట్లేదు అందుకే డాన్స్ చేయలేదు అన్నాడు షోకి ఎందుకొచ్చా అంది శోభా డబ్బు కోసం అన్నాడు. మరి డబ్బులకు న్యాయం చేస్తున్నావా అంటే చెయ్యట్లేదు అన్నాడు. మారేందుకు షో నుంచి నువ్వే వెళ్ళిపో అంది శోభా నేను వెళ్ళను" అన్నాడు.. ఇక ఫైనల్ గా మ్యాజిక్ సెగ్మెంట్ లో శ్రీముఖికి లవ్ ప్రొపోజ్ చేసాడు రవికృష్ణ. " సీరియస్లి నేను మగాడినన్న ఫీలింగ్ గుర్తొచ్చింది నిన్ను చూసాకే..ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసాక యూత్ అనే ఇంకేదో ఫీలింగ్ కూడా వస్తుందని అప్పుడే అర్ధమయ్యింది. నేను బతికున్నంత వరకు ఆ ఫీలింగ్ పోదు" అంటూ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. తీరా ఆ గిఫ్ట్ బాగ్ లో చూసేసరికి అందులో అప్పటి వరకు రవికృష్ణ చేతికున్న వాచ్ అతనికి తెలియకుండా హుడీ అనే మెంటలిస్ట్, మెజీషియన్ మేజిక్ చేసి ఆ గిఫ్ట్ బాగ్ లో పెట్టించి అతని చేతే ఆమెకు ఇచ్చేలా చేసాడు. ఇక అతను మేజిక్ కి అందరూ ఫిదా ఇపోయారు.