English | Telugu

ముద్దిస్తే చెప్తానంటున్న ఆది..ఛీ అన్న దీపికా పిల్లి

ముద్దిస్తే చెప్తానంటున్న ఆది..ఛీ అన్న దీపికా పిల్లి

ఢీ షోలో మంచి డాన్సస్ తో పాటు మంచి స్కిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు టీచర్స్ డే వస్తున్న సందర్భంగా ఆ టాపిక్ మీద ఈ వారం డాన్సర్స్ తమ పెర్ఫార్మెన్సెస్ చేసి చూపించారు.  ఆ స్కిట్స్ వేయడానికి ఆది, దీపికా పిల్లి ఆల్రెడీ ఉన్నారు. దీపికా వాళ్ళ చుట్టాలు పేరుతో ప్రతీవారం ఒక్కో గెస్ట్ ని పిలుస్తూ ఉంటుంది. ఇక ఈ వారం హైపర్ ఆది తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించడానికి  డైరెక్టర్ గెటప్ లో వచ్చాడు. "ఎంఎం సినిమాలు చేసావ్" అని దీపికా ఆదిని కొట్టి మరీ అడిగింది. "ముద్దిస్తే చెప్తా" అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే "ఛీ" అంది దీపికా. "ఎహె సినిమా పేరే ముద్దిస్తే చెప్తా" అని చెప్పేసరికి "బాగా ఆడిందా" అని ప్రదీప్ అడిగాడు..

కేక పుట్టిస్తున్న స్టుడెంట్ ట్రైలర్! 

కేక పుట్టిస్తున్న స్టుడెంట్ ట్రైలర్! 

కాలేజ్ లైఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్. యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏ స్టోరీ అయిన దాదాపు హిట్టే.. అప్పుటి కొత్తబంగారు లోకం,  హ్యాపీ డేస్ ల నుండి ఇప్పటి బేబీ సినిమా వరకు అన్ని యూత్ ని ఆకర్షిస్తూ వెండితెర మీద పేపర్లు విసిరేలా చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తో షణ్ముఖ్ 'స్టూడెంట్' వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ ని కొన్ని వారాల క్రితం రిలీజ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. అంతే కాకుండ  'ది స్టూడెంట్ యాంథమ్' లిరికల్ సాంగ్ కి షణ్ముఖ్ తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ కి  విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చిన అంజలి పవన్

బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చిన అంజలి పవన్

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కావడానికి ఇంకా ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. అలాంటి టైములో ఒక యంగ్ అండ్ డైనమిక్ పెయిర్ హౌస్ లోకి రాము అంటూ చెప్పేసింది. బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు న్యూ సీజన్ లోకి ఎంట్రీ ఇస్తోంది.   ఈ సారి ఉల్టా పల్టా అంటూ సరికొత్త వెర్షన్ లో  రాబోతుంది. ఆరో సీజన్ పై ఆడియన్స్ నుంచి బాగా నెగిటివిటీ రావడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయింది. ఇక ఈ షోకి  బిగ్ బాస్ లోకి సీరియల్ నటి, యూట్యూబర్ అంజలి పవన్ వెళ్తున్నట్లుగా  వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే బిగ్ బాస్ టీం సంప్రదించి.. ఆమెతో ఒప్పందం కూడా చేసుకున్నారట. ఐతే  అనుకోని కారణంతో ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదనే విషయం తెలుస్తోంది.  ఆమె పలు సీరియల్స్ లో నటిస్తూ... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  

మా అమ్మకు దూరంగా ఉండండి

మా అమ్మకు దూరంగా ఉండండి

అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే బుల్లితెరను వదిలిపెట్టేసిందో అప్పటినుంచి మూవీస్ లో నటిస్తూ మంచి మంచి షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.  ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. అసలు ఈ చీర కట్టులో కుందనపు బొమ్మలా ఉంది అనసూయ . ఐతే ఉప్పల్ లో ఉన్న ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేసింది అనసూయ. ఈ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి స్టాఫ్ అంతా కూడా ఆమెతో కల్సి ఫోటోలు, సెల్ఫీలు దిగారు.