చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ మేట్స్ కలయిక.. అందుకోసమేనా?
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం అన్నట్టు.. ఎక్కడెక్కడో ఉన్నవారిని ఒక్క దగ్గరికి చేస్తుంది బిగ్ బాస్. అలా సీజన్ సిక్స్ లో శ్రీహాన్, ఇనయా, అర్జున్ కళ్యాణ్ కలిసారు. వీళ్ళు ఒకరికొకరు లోపలికి వెళ్ళేవరకు తెలియదు. లోపలికి వెళ్ళాక అందరు మంచి స్నేహితులుగా మారారు. శ్రీహాన్, ఇనయా, అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలుసుకోలేదు. కానీ తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా వీళ్ళు కలుసుకున్నారు.