English | Telugu

ఓబులమ్మ వెర్సెస్ రాజ్యలక్ష్మి ...మీ ప్రేమతోనే ఈ పాత్రలు చేసాను!

దూరదర్శన్ రాజ్యమేలుతున్న రోజుల్లో అప్పుడప్పుడే వస్తున్న కొత్త కొత్త చానెల్స్ లో ప్రోగ్రామ్స్ కి ఆడియన్స్ అలవాటు పడుతున్న సమయంలో యాంకర్ గా అడుగుపెట్టింది ఝాన్సీ. అప్పట్లో ఝాన్సీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఝాన్సీ, ఉదయభాను, సుమ ఈ ముగ్గురు లేడీ యాంకర్స్ మాత్రమే అప్పటి ప్రోగ్రామ్స్ ని లీడ్ చేసేవారు. ఇక వేళల్లో ఉదయభాను, ఝాన్సీ కొంతకాలం ఆగిపోయారు. కానీ సుమా ఎక్కడ గ్యాప్ లేకుండా పని చేస్తూనే ఉంది. ఐతే ఝాన్సీ ఇటు బుల్లితెర మీద అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ మంచి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా సలార్ లో, మిస్ పర్ఫెక్ట్ మూవీస్ లో ఝాన్సీ రోల్స్ రెండూ రెండు భిన్న పార్శ్వాలలుగా ఉంటాయి. సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే అప్ డేట్ అవుతున్న ఝాన్సీ తన పెరటి తోటలోని పంటల్ని చూపిస్తూ అలాగే తన నెక్స్ట్ మూవీస్ కి సంబందించిన అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "సలార్ లో ఓబులమ్మ గా, మిస్ పర్ఫెక్ట్ లో రాజ్యలక్ష్మిగా రెండు విభిన్న పాత్రలు చేసాను. మీ అందరి ప్రేమతో నేను నా పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేసాను.  

లవర్ ఎవరూ లేరు...సింగిల్ సింతకాయమే అంటున్న రష్మీ!

ఫిబ్రవరి 14 వస్తుంటే చాలు వాలెంటైన్స్ డే వస్తోందిగా మరి ప్లాన్స్ ఏమిటి...ఏం చేస్తున్నారు. మీ లవర్ కి ఏమిస్తున్నారు, ఎలా ప్రొపోజ్ చేస్తున్నారు అంటూ ఫ్రెండ్స్ అడుగుతూనే ఉంటారు. కొంతమంది కొత్త లవర్స్ ని వెతుక్కుంటే కొందరు మాత్రం ఉన్న వాళ్ళను వదిలేస్తూ ఉంటారు. ఏదేమైనా వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల దినం అని చాలా మంది రెడ్ రోజెస్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ ఇష్టమైన వాళ్లకు లవ్ ప్రొపోజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమకు  లవర్స్ లేరని తెగ ఫీలైపోతారు. కొందరు మాత్రం హమ్మయ్యా లవర్స్ లేకపోవడమే బెస్ట్ అని సంబరాలు చేసుకుంటూ ఉంటారు.

కన్నుల పండుగగా బీబీ ఉత్సవం..కుమారి ఆంటీకి ఘన స్వాగతం

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ తో రియూనియన్ థీమ్ ప్లాన్ చేసింది స్టార్ మా...ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా స్టేజి మీద కనిపించేసరికి ఆడియన్స్ కూడా ఫుల్ ఖుషీ ఇపోయారు. "106 రోజులు మీరు చూసిన బిగ్ బాస్ ప్రయాణాన్ని ఒక్క రోజు ఒక్క వేదిక పై ఒక వేడుక లాగా చూస్తే అదే ఈ బీబీ ఉత్సవం" అంటూ షో లీడ్ ని అద్భుతంగా చెప్పింది శ్రీముఖి. "బీబీ ఉత్సవం అన్నారు నాకు తినడానికి కడుపు నిండా పెడతారా" అని అడిగాడు టేస్టీ తేజ. "సీజన్ లో నలుగురిని మింగావ్..ఇంకేం కావాలి నీకు " అంది శ్రీముఖి కామెడీగా. ఇక రాతిక - పల్లవి ప్రశాంత్ "ఉట్టి మీద కూడు" సాంగ్ కి డాన్స్ చేశారు. "హౌస్ లో ఒక మిస్ అండర్స్టాండింగ్ వచ్చింది..మనసులో ఉంటే ఐ యాం సారీ" అని చెప్పింది. దానికి ప్రశాంత్ తెగ సిగ్గుపడిపోయాడు.

చంటి అని పిలిచి ముద్దు పెట్టుకున్నా..వెంకటేష్ గారు భయపడిపోయారు

జీ టీవీలో ప్రసారమవుతున్న సూపర్ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఇందులో మీనా, శ్రీదేవి దేవకన్యలా కనిపించారు. కంటెస్టెంట్స్ ఈ ఎపిసోడ్ లో ఊర మాస్ థీమ్ తో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇక అమ్మాయిగారు సీరియల్ నుంచి రూప- రాజు వచ్చి మీనా నడిచిన "చంటి" మూవీ నుంచి "ఎన్నెన్నో అందాలు" అనే సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. అది చూసిన మీనా చాలా ఖుషీ ఐపోయింది. "చంటి నాకు స్టార్డం ఇచ్చింది" అని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తర్వాత "అన్నుల మిన్నల" సాంగ్ కి కూడా డాన్స్ పెర్ఫార్మ్ చేసారు. "చంటి నువ్వు నాకు నచ్చావ్..చంటి అని లాస్ట్ లో ఆయన్ని పిలిచి గట్టిగా పట్టుకుని ముద్దుపెట్టుకునేసరికి..పాపం వెంకటేష్ గారు భయపడిపోయారు." అంటూ నవ్వుతూ చెప్పింది మీనా.

Brahmamudi : బాత్రూమ్ లో వేడినీళ్ళు పోసుకొని కెవ్వుమన్న రాజ్.‌.‌ ధాన్యలక్ష్మి పంతం నెగ్గుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో..కావ్య, కళ్యాణ్ ఇద్దరు కలిసి రాజ్ చేస్తున్న పని గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ వ్యాయామం చెయ్యడానికి వాళ్ళ ముందుకు వచ్చి కావాలనే అటిట్యూడ్ గా ప్రవర్తిస్తుంటాడు. అప్పుడే ఇందిరాదేవీ,  ప్రకాష్,  సుభాష్ లు వచ్చి.. ఏంటి ఎన్నడు లేనిదీ ఫిట్ నెస్ పై దృష్టిపెట్టావని అడుగుతారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫిట్ నెస్ పెంచు అంది. అందుకే అని రాజ్ అంటాడు. పెళ్లి అయ్యాక ఇలా చేసావ్.. మళ్ళీ ఇప్పుడు అని ఇందిరాదేవి అనగానే.. నేను ఎప్పుడు నిత్య పెళ్ళికొడుకునే అని రాజ్ అంటాడు. ఆ మాటలు అన్ని కావ్య, కళ్యాణ్ ఇద్దరు వింటుంటారు.

Eto Vellipoyindhi Manasu : డబ్బుందని వాళ్ళు పొగరు చూపించారు.. నిజాయితీ గల ఆమెను అతను ఆదుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -16 లో.. రామలక్ష్మి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా ఉన్న ఇంట్లో వస్తువులని చూసి షాక్ అవుతుంది. ఏమైందని అడుగగా రింగ్ పోగొట్టుకున్న అతని అమ్మ అంట.. తన మనుషులని తీసుకొని వచ్చి గొడవ చేసిందని పింకీ చెప్తుంది. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. లేదంటే వాళ్ళందరు నా చేతిలో అయిపోయేవాళ్ళు.. డబ్బున్నవాళ్ళ పొగరు చూపించారని మాణిక్యం అంటాడు. ఇప్పుడు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్తుంటే.. రామలక్ష్మి ఆపి ఉంగరం కోసం డబ్బు ఉందని వాళ్ళ పొగరు చూపించారు. మనం ఉంగరం ఇచ్చి మన ఆత్మభిమానం చూయించుకున్నాం వదిలేయు నాన్న అని రామలక్ష్మి అనగానే మాణిక్యం ఆగిపోతాడు.