English | Telugu
పేరు కూడా చెప్పకుండా రోజెస్ పంపిన ఆ సీక్రెట్ వాలైంటైన్!
Updated : Feb 8, 2024
కొందరు ప్రేమికులు ప్రేమికుల రోజుని గ్రాంఢ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే ఉన్నోడు రిచ్ గా.. లేనోడు ఉన్నంతలో ఇది జరుపుకుంటారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళిన కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం దీనిని ఓ పెద్ద పండగలా జరుపుకుంటున్నారు. అలా వాళ్ళు జరుపుకోవడం వెనుక ఓ కారణం ఉంది. మాకున్న ఫ్యాన్ బేస్ ని మరింత పెంచుకోవాలంటే ఇలాంటన్నీ జరుపుకోవాలని తెగ ట్రై చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నారు.
ఇలా ప్రస్తుతం వైరల్ అవుతున్న వారిలో బుల్లితెర ధారావాహికల్లో నటిస్తున్న నటీనటులు కొందరైతే.. మరికొందరిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఆర్జే సూర్య తన ఇన్ స్ట్రాగ్రామ్ లో గులాబీ పూలతో కూడిన ఓ బొకేను పోస్ట్ చేశాడు. బెస్ట్ విషెస్ ఫర్ యూ అని రోజ్ డే కోసం రాసి పంపిన ఈ అభిమాని ఎవరో తనకి తెలియదని ఆర్జే సూర్య చెప్పాడు. " థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్ ప్రైజ్ లవ్. మై సీక్రెట్ వాలంటైన్.. పేరు కూడా రాసి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని.. ఎనీ హౌ హ్యాపీ రోజ్ డే " అని ఆర్జే సూర్య చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ బేస్ ని తెచ్చుకున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఆర్జే సూర్య ఉన్నప్పుడు.. ఒకవైపు ఇనయా, మరోవైపు ఆరోహి. ఇలా ఇద్దరితో ఒకేసారి లవ్ ట్రాక్ నడిపాడు. ఇది కంటెంట్ కోసమే అని అది చూసిన ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఇప్పుడు అదే అని తెలిసింది. ఆ తర్వాత రెగ్యులర్ గా ఫోటోలతో, రీల్స్ తో తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఆర్జేగా, యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్‌లో నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు సూర్య. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిన వారిలో గీతు రాయల్, ఇనయ, ఆదిరెడ్డిలతో పాటుగా ఆర్జే సూర్య కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు లవర్స్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటున్న లిస్ట్ లో ఇతను చేరిపోయాడు. మరి ఇతనికి సీక్రెట్ గా గులాబీలని పంపిందెవరు అనేది అందరిలోను ఓ క్యూరియాసిటిని పెంచేసింది.