హైపర్ ఆది.. టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ.. పవన్ కోసం ఏదైనా..
జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఎంతగా నవ్విస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన కమెడియన్ ‘హైపర్ ఆది’. ఆది వేసే పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ తో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఐతే జడ్జిగా ఇంద్రజ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆది, ఇంద్రజ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంద్రజ గజ్జె కట్టి డాన్స్ వేస్తే ఆ సీన్ గురించి మరో ఎపిసోడ్ లో కౌంటర్ వేసేస్తాడు ఆది. ఆది, ఇంద్రజ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కామెడీ కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. హైపర్ ఆది ఈ మధ్య సినిమాల మీద ఫోకస్ పెట్టినా బుల్లితెర మీద ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.