English | Telugu

లవర్ ఎవరూ లేరు...సింగిల్ సింతకాయమే అంటున్న రష్మీ!


ఫిబ్రవరి 14 వస్తుంటే చాలు వాలెంటైన్స్ డే వస్తోందిగా మరి ప్లాన్స్ ఏమిటి...ఏం చేస్తున్నారు. మీ లవర్ కి ఏమిస్తున్నారు, ఎలా ప్రొపోజ్ చేస్తున్నారు అంటూ ఫ్రెండ్స్ అడుగుతూనే ఉంటారు. కొంతమంది కొత్త లవర్స్ ని వెతుక్కుంటే కొందరు మాత్రం ఉన్న వాళ్ళను వదిలేస్తూ ఉంటారు. ఏదేమైనా వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల దినం అని చాలా మంది రెడ్ రోజెస్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ ఇష్టమైన వాళ్లకు లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమకు లవర్స్ లేరని తెగ ఫీలైపోతారు.

కొందరు మాత్రం హమ్మయ్యా లవర్స్ లేకపోవడమే బెస్ట్ అని సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రష్మీ కూడా అదే చెప్తోంది. రష్మీ పేరుతో ఒక వీడియోని ఎవరో ఎడిట్ చేసి పంపిస్తే రష్మీ దాన్ని తన స్టేటస్ లో పోస్ట్ చేసింది..ఆ వీడియోలో "వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏమిటి అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే..సింగల్ సింతకాయమే.." అంటూ రష్మీ తనకు లవర్ లేడన్న విషయాన్ని చెప్తూ ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉంది. ఐతే రష్మీ ఆ వీడియో కింద ఒక పోస్ట్ పెట్టింది.

"లవర్ లేరంటూ నేను అసలు బాధపడడమే లేదు. సింగల్ గా ఉండడం ఎంత హాయిగా ఉందో చెప్పలేను" అని చెప్పింది రష్మీ. ఐతే బుల్లితెర మీద రష్మీ-సుడిగాలి సుధీర్ జోడిని చూసి చాలా మంది ఆడియన్స్ రియల్ లైఫ్ లవర్స్ అనుకున్నారు. కానీ అదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ లో అలాంటిది ఏమీ లేదని చెప్పారు. కానీ రష్మీని చూసినప్పుడు సుధీర్ ఫేస్ లో సుధీర్ ని చూడగానే రష్మీ ఫేస్ లో వచ్చే సంతోషాన్ని చూసి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అంటూ ఎన్నో ట్రోల్ల్స్, మీమ్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి లేరు. కానీ చాల స్కిట్స్ లో మాత్రం వీళ్ళ లవ్ పెయిర్ గురించి సెటైర్స్ పేలుతూనే ఉంటాయి. ఇక రష్మీ తాను ఎట్టకేలకు హనుమాన్ మూవీని చూశానని చెప్తూ తన స్టేటస్ లో ఒక పిక్ పెట్టుకుంది. రష్మీకి రాముడు అంటే ఎంత ఇష్టమో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో తెలిసింది. ట్విట్టర్ లో రాముడు మీద కామెంట్స్ చేసినవారికి బాగా బుద్ధి కూడా చెప్పింది రష్మీ.