English | Telugu
ఫోన్ చేసి ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇచ్చి కాలేజీ మూయించా...
Updated : Feb 9, 2024
ఉస్తాద్ ప్రతీ వారం లాగే ఈ వారం షో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ వారం షోకి ప్రస్థానం మూవీతో మంచి పేరుతెచ్చుకున్న శర్వానంద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో శర్వా, రామ్ చరణ్, మనోజ్ వీళ్లంతా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మనోజ్ శర్వాని ఎన్నో ప్రశ్నలు వేసాడు. "కాలేజీలో ఉన్నప్పుడు ఏమిటి ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇచ్చావంట" అని మనోజ్ అడిగేసరికి "నేను చదువుకునేటప్పుడు ఒకసారి ఏబివిపి వాళ్ళు బంద్ ప్రకటించారు.
కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు కానీ మా కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం ఎవరొస్తారులే అని చెప్పి క్లోజ్ చేయలేదు. చాలా సేపు చూసాం కాలేజ్ క్లోజ్ చేస్తారేమో అని కానీ ఎంతసేపటికీ క్లోజ్ చేయకపోయేసరికి మా కాలేజ్ బయట ఉండే ఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి మా ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి మేము ఏబివిపి వాళ్ళం మాట్లాడుతున్నాం కాలేజీ ఓపెన్ చేశారంటా... అరగంటలో ముయ్యకపోతే అద్దాలన్నీ మిగిలిపోతాయి అని చెప్పి వచ్చి మళ్ళీ కాలేజీలో వెయిట్ చేస్తున్నాం.
ఇక స్టూడెంట్స్ అంతా కూడా ఏబివిపి వాళ్ళు వస్తున్నారంట పరిగెత్తండి అంటూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు అలా అప్పుడు కాలేజీ క్లోజ్ చేశారు. కానీ మేమే ఫోన్ చేశామని ఎవరికీ తెలీదు. మనం చదువు ఇస్తాం కానీ మనం చదవం...ఇక నాకు రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం తనే..చిరంజీవిగారి లానే ఆ ప్రేమను పంచడంలో ముందుంటాడు. ఇంటర్ లో ఉన్నప్పుడు నేను రామ్ చరణ్ కిటికీ స్క్రూలు పీకేసి ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తూ దొరికిపోయేవాళ్ళం." అని చెప్పాడు శర్వానంద్. దానికి కొనసాగింపుగా మనోజ్ కూడా తన ఓల్డ్ మెమొరీస్ ని గుర్తు చేసుకుని చెప్పాడు "అప్పట్లో మెగా ఫోన్ ఉండేది..గాలిపటాలు ఎగరేసే వాళ్ళం మా ఇల్లు చరణ్ వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉండేవి. ఇలా అల్లరి చేస్తూండేవాళ్ళం. చరణ్ ఇంటికి మా ఇంటికి మధ్య గుమ్మడి గారి ఇల్లు ఉండేది. ఆయన పిల్ల రాక్షసుల్లారా ఏమిటా గోల అంటూ తట్టుకోలేక మా మీద అరిచేవాళ్ళు." అని చెప్పాడు మనోజ్.