English | Telugu
కన్నుల పండుగగా బీబీ ఉత్సవం..కుమారి ఆంటీకి ఘన స్వాగతం
Updated : Feb 9, 2024
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ తో రియూనియన్ థీమ్ ప్లాన్ చేసింది స్టార్ మా...ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా స్టేజి మీద కనిపించేసరికి ఆడియన్స్ కూడా ఫుల్ ఖుషీ ఇపోయారు. "106 రోజులు మీరు చూసిన బిగ్ బాస్ ప్రయాణాన్ని ఒక్క రోజు ఒక్క వేదిక పై ఒక వేడుక లాగా చూస్తే అదే ఈ బీబీ ఉత్సవం" అంటూ షో లీడ్ ని అద్భుతంగా చెప్పింది శ్రీముఖి. "బీబీ ఉత్సవం అన్నారు నాకు తినడానికి కడుపు నిండా పెడతారా" అని అడిగాడు టేస్టీ తేజ. "సీజన్ లో నలుగురిని మింగావ్..ఇంకేం కావాలి నీకు " అంది శ్రీముఖి కామెడీగా. ఇక రాతిక - పల్లవి ప్రశాంత్ "ఉట్టి మీద కూడు" సాంగ్ కి డాన్స్ చేశారు. "హౌస్ లో ఒక మిస్ అండర్స్టాండింగ్ వచ్చింది..మనసులో ఉంటే ఐ యాం సారీ" అని చెప్పింది. దానికి ప్రశాంత్ తెగ సిగ్గుపడిపోయాడు.
ఇక నాయని పావని హీరో శివాజీని పట్టుకుని తనివి తీరా ఏడ్చేసింది. శివాజితో తన తండ్రిని చూసుకుంటున్నానని హౌస్ లో ఉన్నప్పుడే చెప్పింది పావని. తర్వాత శోభా శెట్టి స్టేజి మీదకు ఒక షర్ట్ ని తీసుకుని వచ్చింది " నాకు ఇది చాలా ప్రీషియస్..సర్ నాకు ఇది ఇచ్చారు. ఐతే ఆరోజు అమర్ నన్ను ఈ షర్ట్ కావాలని అడిగాడు కాబట్టి నేను అమర్ కి ఇచ్చేస్తున్నా" అని ఆ షర్ట్ ని ఇవ్వడంతో అమర్ ఆ షర్ట్ వేసుకుని స్టేజి మీద రాంప్ వాక్ చేసాడు. తర్వాత ప్రశాంత్ వెళ్లి కుమారి ఆంటీని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు "ఈ అక్క ప్రపంచమంతటికీ అక్క మా కుమారక్క" అంటూ కుమారిని శ్రీముఖి హాగ్ చేసుకుంది. ఇక కుమారి ఆంటీ ఫేమస్ లివర్ డైలాగ్ ని శ్రీముఖి-అర్జున్ చెప్పి కాసేపు ఫన్ చేసారు. ఇక కుమారి కూడా వాళ్ళ డైలాగ్ కి నవ్వేసింది. ఇలా బీబీ ఉత్సవం షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక నెటిజన్స్ మాత్రం అమర్ దీప్ - శోభా శెట్టి ఫ్రెండ్ షిప్ ని తెగ మెచ్చుకుంటున్నారు. నాయని - శివాజీ అన్న రిలేషన్ చూసి కళ్ళు చెమర్చాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.