English | Telugu

భర్త కోసం బిగ్ బాస్ గేట్ ముందు భార్య.. వీడియో వైరల్!

భర్త కోసం బిగ్ బాస్ గేట్ ముందు భార్య.. వీడియో వైరల్!

బిగ్ బాస్ మొదలై ఇప్పటికి ఇరవై రోజుల పైనే అవుతుంది. ఇప్పటికే హౌజ్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్.. వాళ్ళ కుటుంబసభ్యులని మిస్ అవుతున్నామంటు తమ బాధని కెమెరాలకి చెప్పుకున్న వాళ్ళున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి వారంలోనే  ఆట సందీప్ తన ఆటతీరుతో గెలిచి అయిదు వారాల ఇమ్యూనిటి సొంతం చేసుకొని మొదటి ఇంటి సభ్యుడయ్యాడు. ఆయితే ఆట సందీప్ ఈ మధ్య సీరియల్ బ్యాచ్ తో కలిసి ఎక్కువ టైమ్ ఉండటం వల్ల వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ కు ఆట సందీప్ కి మధ్య దూరం పెరిగే ఛాన్సులు చాలానే ఉన్నాయి. తన గేమ్ ఆడతే విజేత అయ్యే ఛాన్స్ ఉంది కానీ అలా కాకుండా సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ గా ఉంటే ఓటింగ్ లో చివరకి పడిపోతాడనేది వాస్తవం.