English | Telugu

Eto Vellipoyindhi Manasu : డబ్బుందని వాళ్ళు పొగరు చూపించారు.. నిజాయితీ గల ఆమెను అతను ఆదుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -16 లో.. రామలక్ష్మి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా ఉన్న ఇంట్లో వస్తువులని చూసి షాక్ అవుతుంది. ఏమైందని అడుగగా రింగ్ పోగొట్టుకున్న అతని అమ్మ అంట.. తన మనుషులని తీసుకొని వచ్చి గొడవ చేసిందని పింకీ చెప్తుంది. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. లేదంటే వాళ్ళందరు నా చేతిలో అయిపోయేవాళ్ళు.. డబ్బున్నవాళ్ళ పొగరు చూపించారని మాణిక్యం అంటాడు. ఇప్పుడు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్తుంటే.. రామలక్ష్మి ఆపి ఉంగరం కోసం డబ్బు ఉందని వాళ్ళ పొగరు చూపించారు. మనం ఉంగరం ఇచ్చి మన ఆత్మభిమానం చూయించుకున్నాం వదిలేయు నాన్న అని రామలక్ష్మి అనగానే మాణిక్యం ఆగిపోతాడు.

ఆ తర్వాత బాధపడుతున్న వాళ్ళ అమ్మని వంట చేయమని పంపించి.. తన తమ్ముడు, చెల్లెలు కలిసి ఇల్లంతా సర్దుతారు. మరొకవైపు సీతకాంత్ ఫ్యామిలీ అంత భోజనం చేస్తుంటారు. రింగ్ చూస్తూ సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ అమ్మాయి హానేస్ట్ గా రింగ్ తీసుకొని వచ్చిందని సీతాకాంత్ చెప్పగానే.. హనెస్టీగా కాదు నేను వెళ్లి బెదిరిస్తే ఇచ్చారని వాళ్ళ అమ్మ శ్రీలత చెప్పగానే.. అసలు ఏమైందని సీతకాంత్ అడుగగా.. రామలక్ష్మి ఇంటికి సెక్యూరిటీతో వెళ్లి గొడవ చేసిన విషయం శ్రీలత చెప్పగానే.. తప్పు చేసావమ్మ అని సీతాకాంత్ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ అమ్మాయి జెన్యూన్ గా ఇచ్చింది. నేను డబ్బులు ఆఫర్ చేస్తే కూడా తీసుకోలేదు. వెరీ ఇన్నోసెంట్ అని సీతాకాంత్ అంటాడు. నిన్ను తప్పు అనట్లేదు.. నీ పేరు చెప్పి వాళ్ళు గొడవ చెయ్యడం తప్పు అంటున్నానని, ఆ అమ్మాయి రింగ్ తీసుకొని వచ్చింది.. సంస్కారం చూపించింది. గొడవ చేసినందుకు సారీ చెప్పడం మన సంస్కారం.. రేపు వెళ్లి చెబ్దామని సీతాకాంత్ అనగానే శ్రీలత సరేనని అంటుంది. సిరి ఇంకా వాళ్ళ తాతయ్య ఒక అమ్మాయి గురించి అన్నయ్య మాట్లాడడం గ్రేట్.. నాకు ఆ అమ్మాయిని చూడాలని అనిపిస్తుందని సిరి అనగానే.. అనిపిస్తే చూసేయ్యడమే అని వాళ్ళ తాతయ్య అంటారు.

మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి ఎగ్జామ్స్ ఫీ కట్టడానికి వెళ్తుంటే కొంతమంది మాణిక్యం డబ్బులు ఇవ్వాలి తప్పించుకుంటున్నాడని వస్తారు. మాణిక్యాన్ని కొట్టబోతు ఇంకా కార్ అద్దాలు పగులగొడుతారు. దాంతో రామలక్ష్మి ఎగ్జామ్స్ ఫీ వాళ్ళకి ఇస్తుంది. అప్పుడే క్యాబ్ ఓనర్ వచ్చి కార్ అద్దాలు పగులగొట్టి ఉండడం చూసి కార్ తీసుకొని వెళ్తాడు. రామలక్ష్మి ఎంత బ్రతిమిలాడిన అతను వినకుండా తీసుకొని వెళ్తాడు. ఆ గొడవ అంతా సీతాకాంత్ చూస్తుంటాడు. ఏదో గొడవ జరుగుతుందని రామలక్ష్మి దగ్గరికి రాకుండా దూరంగా వుండే చూస్తాడు. అలా రామలక్ష్మి క్యాబ్ ఓనర్ ని బ్రతమిలాడటం చూసిన సీతాకాంత్ ఏం చేస్తాడు. తనని ఆదుకుంటాడా లేక మనకెందుకని వదిలేస్తాడా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.