English | Telugu

నాలోని వేడి సూర్యుడికంటే ఎక్కువ : కిరణ్ రాథోడ్!

నాలోని వేడి సూర్యుడికంటే ఎక్కువ.. ఒప్పుకుంటారో లేదో.. చూసి మీరే కామెంట్ చేయండి అంటూ కొన్ని బోల్డ్ ఫొటోలు అప్లోడ్ చేసింది బిగ్ బాస్ కిరణ్ రాథోడ్. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో రీల్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న వారిలో ఇప్పుడు కిరణ్ రాథోడ్ చేరింది. బిగ్ బాస్ సీజన్-7 లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్. బిగ్ బాస్ సీజన్-7 లోకి  పన్నెండవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అయితే తనకి తెలుగు రాదు. ఇదే తను ఎలిమినేట్ అవడానికి ప్రధాన కారణంగా మిగిలింది. ఎందుకంటే హౌజ్ లో అందరితో కలవడానికి భాష కావాలి. తను మాత్రం హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడేది‌. దాంతో తోటి కంటెస్టెంట్స్ కి ఇబ్బందిగా మారింది. 

ఆది మంచి మనసుకు నెటిజన్స్ ఫిదా...

ప్రతీ శుక్రవారం నాడు కొత్త సినిమాలు రిలీజ్ చేసే ఆనవాయితీని మనం చూసాం..ఐతే ఇదే కాన్సెప్ట్ తో ప్రతీ మంగళవారం నాడు ఒక అక్రమ సంబంధాన్ని గోడ మీద రాసే ఒక కొత్త కాన్సెప్ట్ తో రీసెంట్ గా మంగళవారం అనే మూవీ సైలెంట్ గా వచ్చి మంచి హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే.  అందులో పాయల్ రాజపుత్ నటన పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని స్పూఫ్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసేసింది. రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక గోడ మీద కొన్ని అక్రమ సంబంధాలను రాసిన హైపర్ ఆది డ్యాన్సులు చేస్తూ ఊళ్ళో అందరినీ పిలుస్తూ రచ్చ రంబోలా చేసాడు. "ఇమ్మానుయేల్ వర్ష మధ్య సంబంధం ఉంది, బులెట్ భాస్కర్ -ఢీ తేజస్విని, గడ్డం నవీన్ -మహతి, జిత్తు-స్వాతి మధ్య సంబంధాలు ఉన్నాయి..శాంతి స్వరూప్ కి అందరితో సంబంధం ఉంది" అని రాసి ఉంటుంది.