English | Telugu

Krishna Mukunda Murari : లవ్ ప్రపోజ్ తో కంగుతిన్న ముకుంద.. నాకు కంఫర్ట్ గా ఉండదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో..  పూజారిని కృష్ణ కలిసి జరిగింది చెప్తుంది. నువ్వు కర్పూరం దేవుడి ముందు వెలిగించని పూజారి చెప్పగానే కృష్ణ అలాగే చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ వెలిగించిన కర్పూరం ఆరిపోతుంది. మళ్ళీ ఏంటి ఇలా జరిగిందని కృష్ణ టెన్షన్ పడుతు పూజారిని అడుగుతుంది. ఏం లేదంటు తన భయాన్ని పొగుడుతాడు. ఆ తర్వాత కృష్ణ వెళ్ళిపోయాక.. ఇలా జరగకూడదు కానీ ఆ అమ్మాయి బయపడుతుందని ఏం కాదని చెప్పాను.. ఆ అమ్మాయికి ఏదో సమస్య రాబోతుందని పూజారి అనుకుంటాడు.

Guppedantha Manasu : ముకుల్ చెప్పిన ఆ నిజం వసుధార నమ్మేనా..  అ కొత్త వ్యక్తి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -992 లో.. మహేంద్ర ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాడని తెలిసి ఫణీంద్ర బాధపడుతుంటాడు. వాళ్ళింటికి వెళదాం అని ఫణీంద్ర అనగానే.. వాళ్ళే కాల్ చేస్తారులే అని దేవయాని అంటుంది. అలా అనగానే ఫణీంద్ర తనపై కోప్పడతాడు. కాసేపటికి అందరు మహేంద్ర ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత మహేంద్ర కి ఫోన్ చేసి.. అక్కడ ఏం అన్నారో కనుక్కోమని చక్రపాణి అనగానే.. ఏం అంటారు అది రిషి సర్ బాడీ కాదు అని చెప్తారు. లాస్ట్ టైమ్ కూడ ఇలాగే జరిగిందని అనువసు అంటుంది.

Krishna Mukunda Murari : ప్రతీసారీ అలా జరగడంపై కృష్ణలో మొదలైన టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -385 లో.. కృష్ణ, మురారి ఇద్దరు బయటకు వస్తుంటే.. ఒక పిల్లాడు బండికి ఎదరుగా వచ్చి పడిపోతాడు. అతని వెంబడి ఇంకొకతను వచ్చి.. దుప్పటి దొంగతనం చేసి పారిపోతున్నాడని కిందపడిపోయిన పిల్లాడిని కొడుతాడు. అతడిని మురారి, కృష్ణ  ఇద్దరు ఆపి.‌ ఎందుకు కొడుతున్నావని అడుగుతాడు. దొంగతనం చేసి పారిపోతున్నాడని అతను అంటాడు. ఆ తర్వాత పిల్లాడు మా అమ్మకి జ్వరం వచ్చింది. చలితో వణికిపోతుందని చెప్పగానే.. కృష్ణ, మురారి ఇద్దరు పాపమని పిల్లాడిని తన తల్లి దగ్గరికి తీసుకొని వెళ్లి దుప్పటి టాబ్లెట్స్ ఇస్తారు. మీకు ఏం అవసరం ఉన్నా ఈ నెంబర్ కి కాల్ చెయ్యండని కృష్ణ మురారి ఇద్దరు చెప్తారు.

Brahmamudi : పాపని కాపాడిన అప్పు.. కావ్య కాపురంలో నిప్పులు పోస్తోన్న శ్వేత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో.. పాపని కిడ్నాప్ చేసిన రౌడీల దగ్గరికి పాప అమ్మ మరియు అప్పు ఇద్దరు బయలుదేరి వెళ్తారు. రౌడీలు చూడకుండా పాప దగ్గరికి ఇద్దరు వెళ్లి పాపని తీసుకొని బయటకు వస్తుంటే రౌడీలు అడ్డుపడతారు.. నీకు డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాను కదా.. ఎవరినో తీసుకొని వచ్చావని పాప అమ్మని రౌడీలు బెదిరిస్తుంటారు. అప్పుడే పోలీసులు వస్తారు. మీ సంగతి తెలిసే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసినప్పుడే పోలీసులకి చెప్పానని అప్పు అంటుంది. ఆ తర్వాత చాలా థాంక్స్ అంటు అప్పుకి పాప వాళ్ళ అమ్మ చెప్తుంది.. పోలీసులు కూడా అప్పుని అభినందిస్తారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే ఆదిని మించిపోతా

ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి ఫన్నీ సాంగ్స్ , డాన్సస్ పంచ్ డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అభి మాష్టర్ అటు చంద్రముఖిని, ఇటు కాంచనని కలిపేసి రోహిణి, సత్యతో కలిసి రొమాంటిక్ డాన్సస్ చేసాడు. ఇక అభి మాస్టర్ ఐడియాకి అందరూ ఫిదా ఐపోయి ప్రశంసల జల్లు కురిపించారు. తర్వాత వాళ్ళ డాన్స్ టీమ్ లో ఉన్న రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తమ కామెడీ టైమింగ్ ఏ పాటిదో చూడాలంటూ ఆదిని కూడా రిక్వెస్ట్ చేసాడు అభి మాస్టర్. ఇక మైక్ తీసుకుని తన పేరు రమేష్ అని చెప్పేసరికి ఆది పంచ్ వేసేశాడు. "తమ్ముడు నీ పేరు రమేషా.. పొరపాటున నువ్వు సెలెక్ట్ ఐతే తాగుబోతు రమేష్ కి స్కిట్లు ఇవ్వడం కష్టమవుతుంది" అనేసరికి "ఆయనకు కాదన్న మీకే కష్టం..ఎందుకంటే జనరల్ గా మీరే అందరి మీద నాన్స్టాప్ గా పంచులు వేస్తారు కదా. ఐనా ఇప్పటి వరకు ఆది అన్న చాలా పంచులు వేసాడు.