English | Telugu

Guppedantha Manasu : వసుధారని కాపాడిన ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు.. ఇదంతా వాడి పనేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -993 లో.... ఒంటరిగా ఉన్న వసుధారని రాజీవ్ లాక్కొని వెళ్తుంటాడు. అప్పుడే అక్కడికి ఓ అజ్ఞాతవ్యక్తి వస్తాడు. ఎక్స్ క్యూజ్ మి అని అతను అనగానే‌‌.‌ వసుధార, రాజీవ్ ఇద్దరు అతని వంక చూస్తారు‌. ఇక అటువైపు‌ తిరిగి అతడిని చూసిన రాజీవ్.. ఎవరు నువ్వు.. అడ్రెస్ కావాలా అని అడుగుతాడు.  కాదు ఆ అమ్మాయిని వదిలేయ్ అని అతను అనగానే రాజీవ్ పట్టించుకోకుండా వసుధారని లాక్కొని వెళ్తుంటాడు. ఇక అతను వచ్చి రాజీవ్ చేతిని పట్టుకుంటాడు. చేతిని వదులు అని అతను అన్నా సరే రాజీవ్ వదలకుండ.. వదలని ఏం చేస్తావని పొగరుగా మాట్లాడతాడు. ఇక అతను గన్ తీసి రాజీవ్ కి గురి పెడతాడు. ఆమెని వదలకపోతే నిజంగానే కాలుస్తానని అతను అనగానే..‌కాసేపు ఆలోచించిన రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

కంటతడి పెట్టించే అమ్మ కథ.. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి?

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. 

నువ్వు నా ప్రాపర్టీ...యశ్వంత్ కి శోభా వార్నింగ్!

కార్తీకదీపంలో మోనితగా అందరికీ దగ్గరైన శోభా శెట్టి బిగ్ బాస్ లోకి వెళ్లి దుమ్ము దులిపేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక ఫుల్ బిజీగా మారిపోయింది. అంతేకాదు  తన ప్రియుడు యశ్వంత్‏తో  ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. పనిలో పనిగా కొత్త ఇల్లు కూడా కొనేసుకుంది. కాబోయే అత్తగారిని కూడా కలిసి ఆమెను కూడా చూపిస్తూ ఒక వీడియో చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఐతే ఇప్పుడు శోభా శెట్టి యశ్వంత్ ని ఇప్పటి నుంచే గ్రిప్ లో పెట్టుకోవడానికి రెడీ ఐపోయింది. తన మనసులో మాటల్ని యశ్వంత్ కి వినిపించేలా వీడియో స్టేటస్ లను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

దంచవే మేనత్త కూతురా..

దివి అంటే చాలు చాలామంది దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య అంటూ ఉంటారు. ఇక దివి కూడా అంతే అందంగా ఉంటుంది.  మోడలింగ్ నుంచి మూవీ ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టిన  ఈ ముద్దుగుమ్మ లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి మూవీస్ లో నటించింది . తరువాత  బిగ్ బాస్ ద్వారా  ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ‘మహర్షి’ మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా నటించింది. అలాంటి దివి హాట్ షూట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఎప్పుడూ అవే ఫోటో షూట్స్ అంటే అందరికీ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకే దివి ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

మగవాళ్లకు కూడా పింపుల్స్ వస్తాయండి.. పింపుల్స్ పై ఆడవాళ్లకే రైట్స్ ఉన్నాయండి!

​యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవి ఏది చేసినా ఎం మాట్లాడినా వెరైటీగా ఉంటుంది. రవికి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొంత కొంటె తనం కూడా ఉంది. రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అందులో మస్త్ స్వీట్ ఖీర్ తింటూ తన నుదిటి మీద వచ్చి పింపుల్ ని చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా "నెక్స్ట్ టైం ఎప్పుడైనా పింపుల్ వస్తే ఈ సాంగ్ ప్లే చేయండి..అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే చిన్న మొటిమ కూడా ముత్యమేలే" అంటూ ప్రేమికుడి మూవీ సాంగ్ ని ప్లే చేసాడు.