English | Telugu

గుప్పెడంత మనసులో గృహలక్ష్మి కొడుకు!

ఇది కదా కావాల్సింది జనాలకి.. సీరియల్స్ ని ఆరాధించేవారికి, అభిమానించేవారికి దర్శకులు కొత్త రకం కంటెంట్ ని ఇస్తున్నారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుకి హెల్త్ బాగోలేక నెల రోజుల నుండి రాకపోవడంతో అప్పటికప్పుడు కొత్త క్యారెక్టర్ కోసం కథని మార్చి రాయడం దానికి తగ్గట్టుగా నటీనటులను మార్చడంతో కథలో కాస్త ఆసక్తి పెరుగుతుంది. ‌దీన్నే కొందరు దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు.

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లలో బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి సీరియల్ లకి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే దీనికి కారణం అందులో ఉండే క్యారెక్టర్స్. గుప్పెడంత మనసు సీరియల్ లో గత కొంత కాలంగా రిషి కనపడటం లేదు. దీని గురించి ఈ సీరియల్ ఫ్యాన్స్ గత కొంత కాలంగా డిస్కషన్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే భద్ర, శైలేంద్ర, రాజీవ్ లాంటి విలన్ లని ఎదుర్కుంటూ ఇప్పటివరకు వసుధార ఒంటరిగానే నెట్టుకొస్తుంది. అయితే ఇప్పుడు రిషి స్థానాన్ని భర్తీ చేసేందుకు కథలో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ కొత్త క్యారెక్టర్ ఎవరో కాదు ‘గృహలక్ష్మి’ కొడుకు ప్రేమ్. అవును.. ఇటీవల ముగిసిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో తులసి కొడుకు ప్రేమ్‌గా నటించిన రవి శంకర్ రాథోడ్ నే. గుప్పెడంత మనసు సీరియల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్. రావోయి చందమామ, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్‌లో నటించిన రవి శంకర్ రాథోడ్.. ఇటీవల ‘హనుమాన్’ సినిమాలో కూడా కనిపించాడు. ఇతను యాక్టరే కాదు.. డాక్టర్ కూడా. ఓ వైపు సినిమాలు మరోవైపు సీరియల్స్‌లో నటిస్తూ.. డెంటల్ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్‌ అంతా రిషి కోసం ఎదురుచూస్తుంటే.. రవి శంకర్ ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చాడు. మరి ఇతని పాత్రని రిషి స్థానంలో తీసుకొచ్చారా లేక రిషికి ఫ్రెండ్ గా వచ్చాడా అనేది రానున్న ఎపిసోడ్ లలో తెలుస్తుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..