English | Telugu

మర్చిపోలేని విధంగా పుట్టిన రోజు వేడుకలు చేసిన రోహిణి...

రౌడీ  రోహిణి తన అక్క అనురాధ పుట్టినరోజును తన పుట్టినరోజేమో అన్నంతగా సెలెబ్రేట్ చేసింది. రోహిణి కొత్త డ్రెస్ వేసుకుని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళింది పూజ చేసింది. తన అక్క పుట్టినరోజప్పుడు కొత్త బట్టలు వేసుకుంటుందో లేదో కానీ తాను మాత్రం తన అక్క బర్త్ డేకి కచ్చితంగా కొత్త బట్టలు వేసుకుంటాను అని చెప్పింది. తాను వేసుకున్న డ్రెస్ కూడా తన సిస్టర్ కొనిచ్చింది అని చెప్పింది. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరిలో ఎవరి బర్త్ డే ఐనా కూడా ఇద్దరూ రెడీ అవుతామని  చెప్పింది. అలాగే సాయంత్రం ఫంక్షన్ హాల్ కి అందరినీ ఇన్వైట్ చేసారు.

నా కూతురిని చాలా మిస్ అవుతూ ఉంటా..

ఢీ సెలబ్రిటీ షో ప్రతీ వారం డాన్స్ తో పాటు స్కిట్స్ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇక ఈ షోకి జడ్జెస్ గా ప్రణీత, శేఖర్ మాష్టర్ వచ్చి తమ జడ్జిమెంట్ తో అప్పుడప్పుడు డాన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. అలాంటి జడ్జి ప్రణీత తన ఇన్స్టాగ్రామ్ పేజీలో "వాట్సప్" అని ఫాన్స్ ని అడిగేసరికి నెటిజన్స్ వాళ్ళ వాళ్ళ ప్రశ్నలను అడగడం స్టార్ట్ చేశారు "ఢీ ఫామిలీలో ఒక భాగమైనందుకు ఎలా ఫీలవుతున్నారు" " చాలా బాగుంది. ఇక ఫోటో మా హజ్బెండ్ ది, నందు, కెమెరా టీమ్ వాళ్ళు బ్రేక్ టైములో సరదాగా ఇలా నన్ను ఆటపట్టిస్తూ ఉంటారు" అని చెప్పింది. "మీ కూతురిని మిస్ అవుతున్నారా" " ఎస్.. ఎప్పుడు జర్నీ చేసినా పాప గుర్తొస్తుంది..అందుకే ఉదయం వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి తిరిగి రిటర్న్ వచ్చేసి పాపతో టైం స్పెండ్ చేస్తాను" అని చెప్పింది.

జగతి మేడం గుండెలపై ఎగురుతున్న సీతాకోక చిలుక...ఎవరికోసమో మరి!

జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేసుకుంటుంది అని తెలుగులో ఒక కొంటె  సామెత ఉంది. ఐతే ఇప్పుడు ఈ సామెతను కొంచెం ట్రెండ్ కి తగ్గట్టు మార్చితే వైట్ స్కిన్ టోన్ ఉన్న అమ్మ ఒంటి మీద ఏ  టాటూ వేయించుకున్నా  అందంగా ఉంటుంది అంటున్నారు అందాన్ని ఆరాధించేవాళ్ళు. మరి ఈ సామెత ఎవరి గురించి అనుకుంటున్నారా ఇంకెవరూ మీ , మా మనసు దోచేసిన గుప్పెడంత మనసు జగతి మేడం. అదేనండి అసలు పేరు జ్యోతి పూర్వజ్.. జ్యోతి తన అందంతో ఎంతోమంది మైండ్ ని బ్లాంక్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టే పిక్స్ కావొచ్చు ఫోటో షూట్స్ కావొచ్చు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి.

ఏం మాట్లాడుతున్నావ్..పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకోవడమేంటి ?

పటాస్ ఫైమా బుల్లితెర మీద ప్రసారమయ్యే కొన్ని షోస్ లో చిచ్చుబుడ్డిలా పేలుతూ ఉంటుంది. లేడీ కమెడియన్స్ లో ఫైమాకు ఆడియన్స్ స్పెషల్ ప్లేస్ కూడా దక్కింది. అలాంటి ఫైమా "నన్ను ప్రశ్నలు అడగండి" అని పోస్ట్ చేసేసరికి  నెటిజన్స్ అడగడం మొదలు పెట్టారు. ఒక నెటిజన్ ఐతే "పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకో.. అన్న చాలా మంచోడు" అనే ఒక సలహా చెప్పేసరికి " ఏమయ్యింది చెల్లెమ్మ నీకు. ప్రశాంత్ నాకు తమ్ముడవుతాడు" అంటూ కామెంట్ పెట్టింది ఫైమా. "మీరు స్టార్ మా పరివారానికి రావడం లేదు ..ఏమయ్యింది నాకు క్లారిటీ కావాలి" అని అడిగారు "నాక్కూడా తెలీదు...గ్యాప్ వచ్చింది. "ఏంటక్కా మీ రాకుమారుడిని వెతుకుతున్నావా" అంటే  "హా తప్పిపోయాడు" అని చెప్పింది.

ఊరికే అనలేదు డాక్టర్ బాబు అని ఈ వయసులోనే ఇలా ఉంటే...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ స్పెషల్ ఈవెంట్ ని సెలెబ్రేట్ చేశారు. ఫస్ట్ జోడిగా నిరుపమ్-మంజుల  పరిటాల జోడి వచ్చింది. "ఎన్ని సంవత్సరాలైంది మీ పెళ్లై" అని మంజులని అడిగింది శ్రీముఖి. "13 ఏళ్ళు అయ్యింది" అని చెప్పింది. "సరే మీ పెళ్లి రోజు ఎప్పుడు.." అని నిరుపమ్ ని అడిగింది శ్రీముఖి "అక్టోబర్ 2 " అని చెప్పేసరికి "అది గాంధీ జయంతి కదా సర్" అంటూ వెనక నుంచి హరి కోరస్ గా అనేసరికి మంజుల కూడా సీరియస్ గా చూసింది.. దాంతో వెంటనే  డాక్టర్ బాబు "అక్టోబర్ 3 " అని ఆన్సర్ కరెక్ట్ చేసుకుని చెప్పాడు. తర్వాత అమర్ దీప్- తేజు జోడి వచ్చి రెడ్ రోజెస్ ని ఎక్స్ చేంజ్ చేసుకున్నారు.