English | Telugu

థియేటర్ లో పాప్ కార్న్ ఎలా తినాలో చూపిస్తున్న దీపిక.. 


సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని.. అనేది 90's వెబ్ సిరీస్ తో ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.‌ ఇన్ స్టాగ్రామ్ లో ఈ సాంగ్ కి రీల్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆ రెండు లివర్ లు ఎక్స్ ట్రా కుమారీ అంటీ, ఈ సాంప్రదాయని సుప్పినీ, కుర్చీ మడతబెట్టి ఇవన్నీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండింగ్ లోకి ' బ్రహ్మముడి' సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు చేరింది.

స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో కనకం-కృష్ణమూర్తిల కుమార్తెగా కావ్య చేస్తోంది. దుగ్గిరాల ఇండి వారసుడు అపర్ణ సుభాష్ ల‌ కొడుకు రాజ్ ని పెళ్ళి చేసుకున్న కావ్య.. ఎంతో అనుకువగా ఉంటూ అందరి మనసులు దోచేస్తోంది. అయితే కొత్త కోడలు అనామిక రావడంతో కావ్యది ఏం తప్పు‌లేకపోయిన అప్పు ప్రేమ వల్ల తనని ధాన్యలక్ష్మి పూర్తిగా అపార్థం చేసుకుంది. దాంతో కథలో కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రాజ్ తన ఫ్రెండ్ శ్వేతని ప్రేమిస్తున్నాడని కావ్య అపార్థం చేసుకొని అతడినే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఇదే అదునుగా భావించిన రాజ్.. కావ్యని నానారకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే శ్వేత మాత్రం నిజం చెప్పాలనే ప్రయత్నిస్తుంది. మరి రాజ్, కావ్యల మధ్య అపార్థాలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారా లేదా అనే క్యూరియాసిటితో ఈ సీరియల్ సాగుతోంది.

అయితే సీరియల్ లో సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా కన్పించే కావ్య అలియాస్ దీపిక రంగరాజు.. బయట మాస్ ఊరమాస్ అంటుంది. ఆదివారం విత్ స్డార్ మా పరివారం షోలో రాజ్ తో కలిసి కావ్య చేసిన సెటైరికల్ పేరడి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ‌బయట చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా తను ఓ సినిమాకి వెళ్లి.. అందులో పాప్ కార్న్ తింటూ ఓ వీడియో చేసింది. ‌ఇక్కడివరకు బానే ఉంది.‌ కానీ తను రెండు విధాలుగా తింది. ఎవరైన మనం పాప్ కార్న్ తింటున్నప్పుడు ఎలా తినాలో.. ఎవరూ చూడనప్పుడు ఎలా తినాలో చేసి చూపించింది. అయితే ఈ వీడియోకి సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని పాట ఆడ్ చేయడంతో‌ సూపర్ సెట్ అయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు సీరియల్ లో కంటే బయటే బాగుంటారు. మీరు ఇలా ఒరిజినల్ గా ఉంటేనే నచ్చుతారని, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. ‌ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.