English | Telugu

Eto Vellipoyindhi Manasu:చదువుకోవాలన్న నీ సంకల్పం నాకు బాగా నచ్చింది.. మీ సవతికొడుకు మాట విన్నాడా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -21 లో.. సీతాకాంత్ రెడీ అయి కార్ దగ్గరకి వస్తాడు. రామలక్ష్మి డ్రైవర్ డ్రెస్ లో రెడీగా ఉంటుంది. నువ్వు డ్రైవర్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు‌. నార్మల్ గా ఉండండి అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత కార్ ఎక్కి ఇద్దరు మాట్లాడుకుంటారు. మీ కండిషన్స్ కి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా.. మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చిందని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత మీరు కూడా బాగా నచ్చారు. మీరు మీ మదర్ కి ఇచ్చే గౌరవం నాకు చాలా నచ్చిందని రామలక్ష్మి అంటుంది. మన ఇద్దరిలో కామన్ క్వాలిటీ ఒకటి ఉంది. మనమిద్దరం ఫ్యామిలీకీ ఇంపార్టెన్స్ ఇస్తామని రామలక్ష్మి అంటుంది. వాళ్ళ అలా మాట్లాడుకోవడం చూసిన పెద్దాయన.. డ్రైవర్, పిఏలతో ముందున్న అమ్మాయిని వెనకాలకి పంపించాలని అంటాడు. ఆ తర్వాత స్పెషల్ క్లాస్ కి వెళ్తున్నావా అని సీతాకాంత్ అడుగుతాడు. రోజు ఈవినింగ్ వెళ్తున్నానని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడు నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసాక ఖాళీగా ఉంటావ్ కదా.. చదువుకోవడానికి ఏర్పాటు చేస్తానని సీతాకాంత్ అంటాడు. అయిన మీకు నా చదువుపై ఎందుకు అంత ఇష్టమని రామలక్ష్మి అడుగుతుంది. చదువుకోవాలన్న నీ సంకల్పం నాకు బాగా నచ్చిందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత శ్రీలతకి వినిపించేలా కావాలనే తనని రెచ్చగొట్టేలా పనిమనిషితో శ్రీలత మాట్లాడుతుంది. అది విని శ్రీలత కోపంగా శ్రీవల్లిని పిలుస్తుంది. మీరు కోపంగా మాట్లాడిన సరే ఈ రోజు మీ సవతి కొడుకు మీ మాట విన్నాడా అని శ్రీవల్లి అనగానే.. సీత ఏంటో నాకు తెలుసు.. ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసని శ్రీలత చెప్పేసి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాక ఒక అమ్మాయి సీతాకాంత్ కి మైక్ లో చెప్తు ప్రపోజ్ చేస్తుంది. అది విని సీతాకాంత్ వెళ్లి తనని జాబ్ లో నుండి తీసేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మికి చదువుకోవడానికి ఒక రూమ్ ఏర్పాట్ చేసి అక్కడకి వెళ్లి చదువుకోమని చెప్తాడు. మరొకవైపు ధన ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని సిరి టెన్షన్ పడుతుంది. తన ఫ్రెండ్స్ ని ధన కన్పించాడా అని సిరి అడుగుతుంది. ఆ తర్వాత ధనకి ఎదురుగా సిరి వెళ్లిన ధన పట్టించుకోకుండా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.