English | Telugu

Krishna Mukunda Murari:ఆ టాస్క్ నుండి తప్పించుకున్న ముకుంద.. భవాని ఎక్కడికెళ్ళింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -393 లో.. ఈ రోజు ఆదర్శ్ ఏంటో తేడాగా ఉన్నాడని మధు అంటాడు. ఏంటి ప్రొద్దున్నే ఏసేశారా అని కృష్ణ అంటుంది. కొన్ని కొన్ని సిచువేషన్స్ ఫేస్ చెయ్యాలంటే వెయ్యాలని మధు అనగానే అందరు షాక్ అవుతారు. అంటే మీరు ఏదో టాస్క్ లు సర్ ప్రైజ్ లు అంటున్నారు కదా దాని గురించి అనగానే.. అందరు ఒహ్హ్ దాని గురించా అని అనుకుంటారు.

ఆ తర్వాత టాస్క్ లు సర్ ప్రైజ్ లు ఏం ప్లాన్ చెయ్యలేదు.. అదే సర్ ప్రైజ్ అని కృష్ణ అనగానే అందరు నవ్వుకుంటారు. ఈ రోజు టాస్క్ లు ఏదైనా మధు డిసైడ్ చేస్తాడని మురారి చెప్తాడు. దాంతో ఈ రోజు నా ట్యాలెంట్ చూపిస్తానని మధు అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ కి ఆదర్శ్, ముకుంద ఇద్దరు డాన్స్ చెయ్యాలని మధు అంటాడు. ఇప్పుడు తెలుస్తుంది ముకుంద నిజంగా మారిందో లేదో అని మధు తన మనసులో అనుకుంటాడు. ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ అదీ ఆదర్శతోనా.. ఎలా చెయ్యాలని ముకుంద టెన్షన్ పడుతూనే స్టేజి పైకి వెళ్లి ఆదర్శ్ ప్లేస్ లో మురారిని ఉహించుకొని 'జల జల జలపాతం నువ్వు 'అనే పాటకి ఆదర్శతో‌ కలిసి డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళు అలా రొమాంటిక్ గా చెయ్యడంతో.. ఏంటి ముకుంద ఇంత బాగా ఆదర్శ్ తో డాన్స్ చేస్తుంది నిజంగానే మారిపోయిందా? అంటే నేనే పొరపాటు పడుతున్నానా అని మధు అనుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ, మురారీల వంతు రాగానే.. వాళ్లకి మధు మాస్ డాన్స్ చెయ్యమని చెప్తాడు.'కళ్ల జోడు కాలేజీ పాప ' అనే పాటకి కృష్ణ మురారి ఇద్దరు ఫుల్ జోష్ తో‌ డ్యాన్స్ చేస్తారు.

ఆ తర్వాత తాగి భర్త ఇంటికి వస్తే భార్య ఎలా రియాక్ట్ అవుతుంది.. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అని మధు చెప్తాడు. మొదటగా ఆదర్శ్ తాగి ఇంటికి వస్తాడు. ముకుంద ప్రేమగా తాగొద్దంటూ చెప్పగా.. ఇంకా తాగాలి సరిపోలేదని ఆదర్శ్ అంటాడు. ఇంట్లో ఉన్నది తీసుకొని వచ్చి ఇవ్వు అనగానే సరేనని ముకుంద తీసుకొని వస్తుంది. ఆ తర్వాత కృష్ణ, మురారీల వంతు కాగా మురారి తాగి ఇంటికి వస్తే కృష్ణ ఒక ఆట ఆడుకుంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు బాగా చేశారని భవానిని అడగాలని చూస్తే అక్కడ భవాని ఉండదు. అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారీలు క్లోజ్ గా ఉండడం చూసి ముకుంద ఈర్ష్య పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.