English | Telugu

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరీయల్ లో గెస్ట్ క్యారెక్టర్ ఎవరంటే!

బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరీయల్స్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఇందులో గుప్పెడంత మనసు, బ్రహ్మముడి , కృష్ణ ముకుంద మురారీలకి క్రేజ్ ఉంది. అయితే కొత్తగా మొదలైన ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.


ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరిది గతజన్మల బంధం. గతజన్మలో వీరిద్దరు ప్రేమించుకుంటారు కానీ విడిపోతారు. ఈ జన్మలో కలవడానికి మళ్ళీ పుడతారు. సీతాకాంత్ రిచ్ ఫ్యామిలీలో పుడతాడు. రామలక్ష్మి మధ్యతరగతి కుటుంబంలో పుడుతుంది. ఇద్దరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలతకి డబ్బు ఉందని కాస్త పొగరుగా ఉంటుంది. కానీ రామలక్ష్మి ఆత్మాభిమానంతో ఉంటుంది. రామలక్ష్మి వాళ్ళ నాన్న తాగుబోతు. అమ్మ ఇంటిపని చేసుకుంటుంది. రామలక్ష్మి కార్ నడుపుతూ తమ ఇంటికి ఆసరాగా నిలబడుతుంది. అయితే తాజా ఎపిసోడ్ లలో ఆమె కార్ ని ఓనర్ లాక్కోవడంతో సీతాకాంత్ చూసి తన డ్రైవర్ గా రామలక్ష్మికి ఓ అవకాశం ఇస్తాడు. దాంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలవుతుంది. అయితే వీరిద్దరి సంభాషణలో ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చుతాయి. దీంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే సీతాకాంత్ తన చిన్నతనంలో ఎలా ఉండేవాడో కొన్ని ఎపిసోడ్ లు త్వరలో రాబోతున్నాయి. బాల్యంలో సీతాకాంత్ ఎలా ఉంటాడో, అతని క్యారెక్టర్ ఏంటో మరికొన్ని రానున్నాయి. అయితే బాల్యంలో సీతాకాంత్ ఎలా ఉంటాడో చూపించే క్యారెక్టర్ రోల్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఫేమ్ భరత్ రాజ్ చేస్తున్నాడు. అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ద్వారా భరత్ రాజ్ ఎంత ఫేమస్ అయ్యాడో అందరికి తెలిసిందే. అయితే సీతాకాంత్ పాత్రలో ఎలా చేస్తాడోనని ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.