English | Telugu

లవర్స్ డే రోజున బ్రేకప్ చెప్పుకున్న పాగల్ పవిత్ర జంట...


జబర్దస్త్ షో ద్వారా పాగల్ పవిత్ర మంచి లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది. లేడీ కమెడియన్స్ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు రోహిణి, పవిత్ర. రోహిణి టీమ్ లో పవిత్ర కంటెస్టెంట్ గా నటిస్తోంది. జబర్దస్త్ లో పరిచయమైన కొన్ని రోజులకు పవిత్ర మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఇదే ఫేమ్ తో ఈవెంట్స్, షోస్ చేస్తూ, యూట్యూబ్ లో వీడియోస్, రీల్స్ చేస్తూ ఖాళీ లేకుండా ఉంది పవిత్ర..అలాంటి పవిత్ర లవర్స్ డే రోజున ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

ఆమె, తన లవర్ కి బ్రేకప్ చెప్పినట్లు అఫీషియల్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ పవిత్ర శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీ మీద తన ప్రియుడు సంతోష్ ను పరిచయం చేసింది. తన జీవితంలోకి సంతోష్ వచ్చాక లైఫ్ మారిపోయిందని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ఇక ఈ షోలో సంతోష్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేయగానే ఆమె కూడా ఓకే చెప్పేసింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. రింగ్స్ మార్చుకుని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు.

ఇంతలోనే విడిపోయామంటూ ఇన్స్టా పోస్ట్ ద్వారా ఒక బాంబు పేల్చింది పగలు పవిత్ర. " మా శ్రేయోభిలాషులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను...నేను, సంతోష్ పరస్పర అవగాహన ద్వారా ఈరోజు నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతం మా మార్గాలు వేరైపోయాయి. ఐతే ఇప్పటివరకు మేము పంచుకున్న క్షణాలు, ఒకరికొకరం గౌరవించుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేము. మా వ్యక్తిగత ప్రయాణాలలో మా ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు సపోర్ట్ చేయాలని మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని మేము మా శ్రేయోభిలాషులను కోరుకుంటున్నాం..మా బాధను ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. మీరు చూపించిన ప్రేమకి , అందించిన సపోర్ట్ కి ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ మెసేజ్ పెట్టింది కానీ కామెంట్ సెక్షన్ ని క్లోజ్ చేసేసింది. ఐతే పవిత్ర నిజంగానే బ్రేకప్ చెప్పిందా లేదంటే ప్రాంక్ చేస్తోందా అనే విషయాల తెలియాలంటే పవిత్ర నెక్స్ట్ అప్ డేట్ కోసం కొంత వెయిట్ చేయాల్సిందే.