మోక్ష, పంచమి మధ్య లవ్ గేమ్ తో బయటికొచ్చిన అసలు విషయం...
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది..ఈ షోకి "ఊరి పేరు భైరవకోన" మూవీ నుంచి సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ వచ్చి ఈ ఎపిసోడ్ లో ఒక టాస్క్ కూడా ఆడి గెలిచారు. ఇక ఈ షోలో నాగపంచమి సీరియల్ టీమ్ అలాగే మామగారు సీరియల్ టీమ్ వచ్చారు. వీళ్ళతో కొన్ని గేమ్స్ ఆడించింది. ఐతే నాగ పంచమి సీరియల్ హీరోహీరోయిన్ పంచమి, మోక్షతో హోస్ట్ శ్రీముఖి ఒక టాస్క్ ఆడించింది. వీళ్ళు లవర్స్ వాళ్ళే చెప్పేలా శ్రీముఖి, అవినాష్ ట్రై చేసారు. వీళ్ళిద్దరితో ఒక లవ్ గేమ్ ఆడించారు. వీళ్లకు ఒక క్వశ్చనైర్ కూడా ఇచ్చింది శ్రీముఖి. మోక్ష మొబైల్ లో పంచమి పేరు "కుల్లమ్మా" అని ఫీడ్ చేసుకున్నాడు.