Krishna Mukunda Murari:తింగరి నీలో అమ్మ ఉంది.. అమ్మ అయితే చూడాలనుంది!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-395 లో.. ముకుంద, అదర్శ్ ఇద్దరు తమ గదిలో మాట్లాడుకుంటారు. మనమిద్దరం కాశ్మీర్ వెళ్ళిపోదామని ముకుందతో ఆదర్శ్ అనగానే.. ఆశ్చర్యపోయిన ముకుంద.. ఎందుకని అడుగుతుంది. ఆ మంచుకొండలు, ఆ లోయలు, ఆ అనుభూతే వేరు మనం కచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలని ఆదర్శ్ అంటాడు. అత్తయ్య మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు కదా అని ముకుంద అనగానే.. నేను కూడా అమ్మ ఇండియాకి వచ్చాకే వెళ్దామని అంటున్నా అని ఆదర్శ్ అంటాడు. ఇక ముకుంద ఆలోచనలో పడిపోతుంది.