English | Telugu
ఆ జోడిని స్క్రీన్ మీద చూసి చాలా రోజులయ్యిందట...
Updated : Feb 14, 2024
ప్రేమికుల రోజున కొన్ని జంటలు కలిసుంటే చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక సెలబ్రిటీస్ విషయంలో ఎవరెవరు కలిసుంటే బాగుంటుందో ఆడియన్స్ డిసైడ్ చేసి వాళ్ళను అలా చూడాలి అనుకుంటూ ఉంటారు. అలా కలిసుంటే బాగుంటుంది అని ఆడియన్స్ ఆశ పడే జంట బుల్లితెర మీద ఎవరైనా ఉన్నారు అంటే అది సుధీర్ - రష్మీ.. పాపం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం కలవడం లేదు, ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. సుధీర్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రష్మీ షోస్ చేసుకుంటూ ఉంది. వీళ్ళ ప్రేమ, పెళ్లి అప్ డేట్స్ కోసం కొన్ని చానెల్స్ వాళ్ళు సుధీర్ ఫ్రెండ్స్ ని అడిగిన వాళ్ళు కూడా పెద్దగా ఆన్సర్స్ చెప్పడం లేదు.
వాళ్ళ మధ్య ఏమీ లేదు అని చెప్తున్నారు తప్ప ఆడియన్స్ మాత్రం వాళ్ళు కలవాలని లైఫ్ లాంగ్ కలిసి జర్నీ చేయాలని ఆశపడుతున్నారు. మరి అలాంటి టైంలో కొంతమంది ఫాన్స్ అడిగిన విషయానికి రష్మీ క్లియర్ గా ఆన్సర్ ఇచ్చింది. "వాలెంటైన్స్ డే సందర్భంగా సుధీర్-రష్మీ కలిసున్న పిక్స్ కోసం అలాగే వాళ్ళ గురించి మరి కొన్ని హింట్స్ కోసం ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే చాలా రోజులైపోయింది ఈ జోడిని స్క్రీన్ మీద చూసి..వీళ్ళను చాలా మిస్ అవుతున్నాం..అలాగే జీవితాంతం ఈ ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాము.." అంటూ అనేసరికి రష్మీ వాళ్లకు రిప్లై కూడా ఇచ్చింది. "హలో నేను ఒంటరిగా ఉన్నానని రెండు రోజుల క్రితం నేను స్పష్టంగా చెప్పాను కదా...గాయిస్ ఈ విషయాన్ని మీరంతా తెలుసుకుని ముందుకు సాగండి...నన్ను ముందుకు వెళ్లనివ్వండి" అని చెప్పింది రష్మీ. రష్మీ తన కెరీర్ మీద ఫోకస్ చేస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకెళ్తోంది. ఐతే సుధీర్ వెళ్లిపోయిన కొంతకాలం క్రితం వరకు కూడా సుధీర్ - రష్మీ జోడీ మీద స్కిట్స్ లో పంచులు పేలేవి కానీ ఇప్పుడు ఆ జోరు కాస్త తగ్గిందని చెప్పొచ్చు.