English | Telugu

నాన్న అలా బయట పడుకోవడం చూసి ఇంకెందుకు బ్రతికున్నా అనుకున్నా!

నాన్న అంటే ప్రతీ ఒక్కరికి ఒక్కో ఎమోషన్ ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమా నుండి యానిమల్ మూవీ వరకు అన్నీ నాన్న కోసం ఓ హీరో పడే తపనే గుర్తొస్తుంది. ఆ బాండింగ్ అనేది ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ మీద కూడా నాన్నంటే ఓ విడదీయరాని అనుబంధం. ‌

నాన్న కోసం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. గెలిచాడు. కానీ ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది.నాన్న కన్న కలని నెరవేర్చానని ఇరవై నాలుగు గంటలు కాకముందే పల్లవి ప్రశాంత్ ని పోలీసులు చంఛల్ గూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత బెయిల్ కోసం భోలే షావలి ఎంతో కష్టపడ్డాడు. అయితే ప్రశాంత్ జైలులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న జైలు దగ్గరికి వస్తే అతడిని లోపలికి రానివ్వలేదు. దాంతో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న బయట రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద పడుకున్నాడు. ఈ వీడియో అప్పట్లో ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అయింది‌. బయటకొచ్చాక ఈ వీడియో చూసి ఏడ్చానని ప్రశాంత్ చెప్పుకుంటూ ఏడ్చేశాడు.

తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ తో శ్రీముఖి యాంకర్ గా 'బిబి మహోత్సవం' మొదలైంది. ఇందులో శివాజీ, ప్రశాంత్, యావర్, నయని పావని, శోభాశెట్టి, ప్రియాంక జైన్, ఆట సందీప్, భోలే షావలి ఇలా అందరు హాజరయ్యారు. అయితే ఇందులో బిగ్ బాస్ జర్నీ గురించి పల్లవి ప్రశాంత్ ని శ్రీముఖి అడిగినప్పుడు తను ఎమోషనల్ అయ్యాడు. " గెలిచినప్పుడు మా నాన్న మొహంలో సంతోషం చూడాలనుకున్నా కానీ ఆ రోజు కోర్టు బయట మా నాన్న పడుకొని ఉండటం చూసిన తర్వాత నేను ఇంకెందుకు బ్రతికి ఉన్నానా అని అనుకున్నాను " అని పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ గా మారింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.