గోవా షాపింగ్ మాములుగా లేదు...
బుల్లితెర మీద సీరియల్స్ లో నటించే రవికిరణ్, సుష్మకిరణ్ గురించి తెలియని వారుండరు. వాళ్ళు సీరియల్స్ లోనే కాదు...షోస్, ఈవెంట్స్ లో కూడా కలిసి కనిపిస్తారు. అలాగే చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే గనక వాళ్ళ అబ్బాయి ప్రభంజన్ ని కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం రీసెంట్ గా గోవా ట్రిప్ వెళ్లారు. ఇక ప్రభంజన్ నిద్ర పోయేసరికి సుష్మ కిరణ్, రవి కిరణ్ ఇద్దరూ నైట్ షాపింగ్ చేశారు. అక్కడ వాళ్లకు కావాల్సిన బట్టలు, వాళ్ళ అబ్బాయికి కావాల్సిన వస్తువుల్ని బేరాలాడి తీసుకున్నారు. అలాగే అక్కడ నైట్ షాపింగ్ లో అమ్మేవాళ్ళకు అన్ని రకాల భాషలు వచ్చు అన్న విషయాన్నీ కూడా కనిపెట్టారు. ఇక సుష్మ కిరణ్ వాళ్ళు మాట్లాడుకున్నవి కూడా తెలుసుకుని వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడేసరికి సుష్మ షాకైపోయింది.