English | Telugu

బర్త్ డే రోజు గుడ్ న్యూస్!

బర్త్ డే రోజు గుడ్ న్యూస్!

ఈ సెప్టెంబర్ 22న రామానాయుడు స్టూడియోలో తన మూవీ 'ప్రీవెడ్డింగ్ ప్రసాద్'  ఓపెనింగ్ సెర్మనీ జరిగిందని, ఇదే రోజు తన బర్త్ డే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు ముక్కు అవినాష్.‌ "బర్త్ డే రోజు ఇంకో గుడ్ న్యూస్" పేరుతో తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. సుకాస అనే ఫామ్ హౌజ్ లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు అవినాష్. ' ఈ ఫామ్ హౌజ్ కోసం గత రెండు సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను. ఇప్పటికి దొరికింది. ఈ పార్టీకీ నా ఫ్రెండ్స్,  డైరెక్టర్స్, యాక్టర్స్ వచ్చారు. కోన వెంకట్, సాయి కుమార్, కోదండ రామిరెడ్డి, సాయి రాజేశ్ ఇంకా చాలామంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది" అని ముక్కు అవినాష్ అన్నాడు.