English | Telugu
పల్లవి ప్రశాంత్ కి వెల్లువెత్తుతున్న ప్రశంసలు...
Updated : Mar 15, 2024
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్, శివాజీ, భోలే షావలి ఈ ముగ్గురూ కలిసి పేదవాళ్లకు డబ్బును, బియ్యాన్ని డొనేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ లక్ష, ఆట సందీప్ 25 వేలు ఇచ్చారు అలాగే ఇద్దరూ విడివిడిగా ఏడాదికి సరిపడా బియ్యాన్ని కూడా ఇచ్చారు. ఇక ఈ వీడియో వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. నెటిజన్స్ ఐతే వాళ్ళ దాతృత్వానికి ఖుషీ ఐపోతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. "లవ్ యు ప్రశాంత్ నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా..." అని సందీప్ రిప్లై ఇచ్చాడు.
ఇక ఆదిరెడ్డి ఐతే "ఒక రోజు నేను కూడా కలుస్తా నా చేతులతో ఇస్తా...నా డబ్బు కూడా ఇస్తా. వెల్ డన్ పల్లవి ప్రశాంత్..." అన్నాడు. ఇక ప్రిన్స్ యావర్ ఐతే "పల్లవి చాలా గర్వంగా ఉంది. నీ వల్లే ఇదంతా జరుగుతోంది. ఇచ్చిన మాట తప్పేవాడివి నువ్వు కాదు. ఎవరు ఎన్ని మాటలు అన్నా నీకు తోడు మేము ఉన్నాము నిను మేము నమ్ముతున్నాము..." అని అన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకి వచ్చిన ప్రైజ్ మనీని రైతులకు పంచి పెడతాను అని చెప్పాడు పల్లవి ప్రశాంత్. ఈ డబ్బుల్ని పంచుతానని మీతో పాటు నాగార్జున సార్‌కి మాట ఇచ్చా. బరాబర్ నా ప్రైజ్ మనీని రైతులకు పంచుతా. నేల తల్లి సాక్షిగా చెప్తున్నా.. ఇందులో నేను ఒక్క రూపాయి కూడా వాడుకోను.. నేను పుట్టిందే రైతుల కోసం.. వాళ్ళకే ఆ డబ్బు పంచేస్తా’ అంటూ గట్టిగానే స్పీచులు ఇచ్చాడు. ఇక తర్వాత చాలామంది పల్లవి ప్రశాంత్ ని గుచ్చి గుచ్చి కూడా అడిగారు డబ్బు పంచుతున్నానన్నావ్ ఏది అని. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నెమ్మదిగా రంగంలోకి దిగి డబ్బులు పంచుతున్నారు పల్లవి ప్రశాంత్.