English | Telugu
నవదీప్ సమ్మర్ సూక్తులు...ముందు పెళ్లిచేసుకో..తర్వాత స్నానం చేయొచ్చు!
Updated : Mar 14, 2024
ఇన్స్టాగ్రామ్ లో నవదీప్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఆడియో వింటూ కార్ లో కూర్చుని కళ్ళజోడు పెడుతూ తీస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వుకోక తప్పదు ఎవరైనా సరే ..ఇంతకు ఆ ఆడియోలో వస్తున్న మాటలేంటంటే "మీరిద్దరూ కలిసి స్నానం చేయండి. ఏదో సినిమాల్లో చూపిస్తారు కదా అనుకుంటారు..కానీ ఏమీ కాదు. చాలా చక్కగా ఇద్దరూ కలిసి స్నానం చేస్తే మీ మైండ్, బాడీ చాలా రిఫ్రెష్ అవుతుంది. ఇది చాలా సిల్లీగా, ఎంబరాసింగ్ గా అనిపించొచ్చు కానీ మీరిద్దరూ వైఫ్ అండ్ హజ్బెండ్. దానికి ఫీలవ్వాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి" అన్న మాటలకు ఓ రేంజ్ లో ఊహల్లోకి వెళ్ళిపోయాడు.
ఇక నెటిజన్స్ ఐతే ఫుల్ కామెడీ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. "ఏంటి సార్ అంత సేపు ఆలోచిస్తున్నారు..మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా...నీకు వైఫ్ ఉందా..మరెందుకు ఈ రీల్ మీకు. ఫస్ట్ పెళ్లి చేసుకో. అంటే అంది కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఐనా మాకు చెప్పకుండా నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావ్ అన్నా...సిగ్గు పడుతున్నాడు....నవదీప్ అన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా..ఇలాంటివి చాలానే చూసాంలే...ఆమె చెప్పినప్పుడు కూడా అంత నవ్వు రాలేదు అన్నా..నీ ఎక్స్ప్రెషన్స్ కి మాత్రం నవ్వు ఆపుకోలేకున్నాం.." అంటూ కామెంట్ చేస్తున్నారు. నవదీప్ కెరీర్ లో చాలా మంచి రోల్స్ లో కనిపించాడు. నేనే రాజు-నేనే మంత్రి, ఈగల్, గౌతమ్ ఎస్ఎస్సి, ధ్రువ, చందమామ వంటి మంచి మూవీస్ లో నటించాడు..