English | Telugu

మగాళ్ల వంటకు..ఆడవాళ్ళ వంటకు తేడా ఉంటుంది కదా...


కుమారి ఆంటీ ఇప్పుడొక బిగ్ సెలబ్రిటీ ఐపోయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా డైలాగ్ సోషల్ మీడియానే షేక్ చేసేసింది. ఆమె ఫుడ్ సెంటర్ కి వెళ్లి ఫుడ్ టేస్ట్ చేసేవాళ్లంతా కూడా వ్వాహ్ వా అంటూనే ఉన్నారు. ఐతే ఆమె ఫుడ్ అంతా బాగుంటుంది అంటున్నారు కదా అని కార్తీకదీపం సీరియల్ కీర్తి భట్ తన భర్తతో కలిసి వెళ్లి ఫుడ్ టేస్ట్ చేసి అస్సలు బాలేదు అని చెప్పింది. ఆ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాటలకు తాజాగా కుమారి ఆంటీ స్పందించింది. " కీర్తిభట్ నా షాప్ కి వచ్చిన రోజు నేను ఊరికి వెళ్లాను. వంట నేను చేయలేదు. ఆరోజు వేరే వాళ్ళు వంట చేశారు. మగాళ్ల వంటలకు , ఆడవాళ్ళ వంటలకు చాలా తేడా ఉంటుంది.

నేను ఎప్పుడూ ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను. ఎవరి టేస్ట్ వాళ్ళది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, మంచిని యాక్సెప్ట్ చేసినప్పుడు చెడును కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అలా చెప్పారని నేను వాళ్ళను తక్కువ చేయను. నా పని నాది..వాళ్ళ పని వాళ్ళది..ఎవరో నా గురించి చెడుగా మాట్లాడారని నేను కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడ్డం గౌరవం కాదు. ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను" అంటూ కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. ఇక కుమారి ఆంటీ అటు ఫుడ్ బిజినెస్ లోనే కాదు ఇటు షోస్, సీరియల్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఛానెల్స్ కూడా ఆమెను బాగా ఇంటర్వ్యూస్ చేస్తుండడంతో ఆమె రోజురోజుకూ పాపులర్ ఐపోతోంది. రీసెంట్ గా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో కనిపించింది కుమారి ఆంటీ. ఇక అక్కడ కూడా రెమ్యూనరేషన్ బాగా వస్తోందని చెప్పింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..