English | Telugu

భర్తకు విడాకులు ఇస్తున్న బ్రహ్మముడి కావ్య...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో.. మీరు అప్పుని కలిసి మాట్లడడం వల్ల మీ వాళ్ళు నా పుట్టింటి వాళ్ళని తిడుతున్నారని, మీరు తనని కలిసి వాళ్ళని మాటలు అనేలా చేస్తున్నారని కళ్యాణ్ ని కావ్య అనగానే.. మీరు కూడ అంటున్నారా అని కళ్యాణ్ షాక్ అవుతాడు.

మీరు ఇక అప్పుని కలవడం మానెయ్యండి అని కావ్య చెప్పగానే.. వాళ్ళేదో అన్నారని నేను మానేస్తే వాళ్ళు అన్నదే నిజం అవుతుందని కళ్యాణ్ అంటాడు. నేను అప్పుతో మాట్లాడుతానని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్ ని కావ్య తీసుకొని వెళ్తుంది. అప్పుడు రాజ్ బీరువా నుండి డబ్బులు తీసి కావ్యకి ఇస్తాడు. ఎందుకు ఇంత డబ్బు అని కావ్య అడుగుతుంది. డిజైన్స్ వేసావ్ కదా అందుకే అని రాజ్ అంటాడు. సాలరీ ఇస్తున్నారు కదా అని కావ్య అనగానే.. అంటే పాస్ పోర్ట్ వచ్చింది కదా.. అమెరికా వెళ్తావ్ కదా.. ఖర్చులు ఉంటాయి కదా అని ఇసున్నానని రాజ్ అనగానే కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోయాక కావ్య దగ్గరికి ఇందిరాదేవి , భాస్కర్ లు వస్తారు. వాళ్లకి రాజ్ డబ్బులు ఇచ్చిన విషయం కావ్య చెప్తుంది. ఇందిరాదేవి డైవర్స్ పేపర్స్ కావ్యకి ఇచ్చి సంతకం చేసి రాజ్ కి ఇచ్చి తనని చెయ్యమని చెప్తుంది. రాజ్ ఎలా తన ప్రేమని బయటపెట్టడో చూద్దామని ఇందిరాదేవి అంటుంది. కావ్యకి ఇష్టం లేకున్నా ఇందిరాదేవి కావ్యని ఒప్పిస్తుంది.

ఆ తర్వాత కావ్య దేవుడి దగ్గరికి వెళ్లి మొక్కుతు తన బాధని చెప్పుకుంటుంది. బాధపడుతూ విడాకుల పత్రంపై కావ్య సంతకం చేస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి ఆ పత్రాలు తీసుకొని వెళ్లి ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యండి అనగానే.. రాజ్ షాక్ అవుతాడు. మీరు నన్ను వదిలేసి శ్వేతని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అందుకే మిమ్మల్ని బాధపెట్టలేను అందుకే విడాకులు ఇస్తున్నానని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో కావ్యపై నీకున్న ప్రేమని ఆమె బయటకు వెళ్లకముందే చెప్పు అని రాజ్ కి శ్వేత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.