English | Telugu

పాపం సోహైల్.. జబర్దస్త్ లో 'బూట్ కట్ బాలరాజు' స్పూఫ్ రచ్చ!

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన 'బూట్ కట్ బాలరాజు' సినిమా గత నెలలో విడుదలైంది. అయితే ఆ సినిమా చూడటానికి ప్రేక్షకులెవరూ పెద్దగా థియేటర్లకు రాకపోవడంతో భోరున ఏడ్చాడు సోహైల్. "నేను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు సోహైల్ సోహైల్ అని వేల కామెంట్లు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఏమైంది?. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి." అంటూ సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాదు సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే ఓ వ్యక్తి మొబైల్ లో రివ్యూ టైపు చేస్తుండటంతో.. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ ఇన్సిడెంట్ ని తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ రీక్రియేట్ చేశాడు.

తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో సోహైల్ ను గుర్తు చేస్తూ భాస్కర్ చేసిన స్పూఫ్ స్కిట్ నవ్వులు పూయిస్తుంది. 'బూట్ కట్ బాలరాజు' టైటిల్ కి స్పూఫ్ లా 'నాట్ ఔట్ నాగరాజు' అనే సినిమాలో హీరోగా భాస్కర్ కనిపించాడు. సినిమా రిలీజ్ తర్వాత భాస్కర్ ఏడుస్తూ.. "చూడండి అన్నా సినిమాని థియేటర్ కి వచ్చి. నేను రివ్యూయర్లకు ఒకటే చెప్తున్నా. జస్ట్ ముఖేష్ యాడ్ వచ్చింది.. వాడెవడో రివ్యూ పెట్టేశాడు. ముఖేష్ యాడ్ చూసి రివ్యూ పెట్టడం ఏంటన్నా. జబర్దస్త్ లో చేసినప్పుడు జై భాస్కర్ జై భాస్కర్ అని కామెంట్లు పెట్టారు కదరా. అందరూ చూడండి అన్నా" అంటూ భాస్కర్ ఏడుస్తూనే నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరి దీనిపై సోహైల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.