English | Telugu

ఆ కారణంగానే తనని తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారంట!

సినిమా పరిశ్రమలో ప్రతీ ఒక్కరి లైఫ్ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలా కొంతమంది హిట్ సినిమాలు రెండు మూడు చేసిన తర్వాత మధ్యలోనే వారి కెరీర్ ఆగిపోతుంది. దానిని వాళ్ళు మళ్ళీ నిలబట్టుకోవాలని చూస్తుంటారు. అయితే అలా వారు కష్టాల్లోకి వెళ్ళడానికి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులైతే మరికొన్ని సార్లు తమని ప్రేమించినవాళ్ళు కారణమవుతుంటారు. అలా కిరణ్ రాథోడ్ ప్రేమించిన ఓ వ్యక్తి వల్ల లైఫ్ ఎలా మారిందో ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది.

కిరణ్ రాథోడ్ జెమిని సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. నిజానికి ఈమె ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌తో ఒక ఊపు ఊపేసింది. ఉదయ్ కిరణ్ నటించిన శ్రీరామ్ సినిమాలో 'పెదవుల్లో పెప్సీ కోలా' అంటూ స్పెషల్ సాంగ్ చేసింది. నువ్వు లేక నేను లేను, నాని, అందరూ దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, హైస్కూల్, కెవ్వు కేక లాంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే వీటిలో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ మాత్రమే చేసింది. ఇక ఈ బ్యూటీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్‌కి కజిన్ అవుతుంది.

నలభై రెండేళ్ళ ఏళ్ల ఈ హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసిన పెద్దగా ఆకట్టుకోలేదు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటోస్ అండ్ వీడీయోలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది‌. అయితే తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తను ప్రేమించిన వ్యక్తికి తనకి మధ్య కొన్ని గొడవలు జరిగాయని దానివల్ల అతను తనని చెంపపై కొట్టాడని కిరణ్ తెలిపింది. దాంతో తను కూడా కోపంతో కొట్టేసరికి బట్టలన్నీ చిరిగాయని కిరణ్ రాథోడ్ తెలిపింది. అయితే దీనిని ఉపయోగించుకొని ఆఫర్లు ఇస్తామంటు కొందరు తనని ఉపయోగించుకోవాలని అనుకున్నారని కానీ తను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలిపింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తెలుగు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడటంతో హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేక పోయింది కిరణ్.