English | Telugu

Guppedantha Manasu : గ్రాంఢ్ గా వసుధార బర్త్ డే సెలెబ్రేషన్స్.. రగిలిపోయిన వాళ్ళిద్దరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1024 లో....వసుధార బర్త్ డే ని మను కాలేజీలో గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేస్తాడు. ఆ తర్వాత వసుధార కేక్ కట్ చేసి తన హ్యాపీ నెస్ ని స్టూడెంట్స్ తో పంచుకుంటుంది. నాకు రిషి సర్ లేకుండా ఇలాంటివి ఇష్టం ఉండదు. కానీ మీరందరు రిషి సర్ మాస్క్ వేసుకొని ఉండడంతో రిషి సర్ వచ్చారేమోనని అనిపించింది.

ఆ తర్వాత ఇక్కడ మీ అందరి ముందు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇదంతా చేసినందుకు మను గారికి థాంక్స్ అని చెప్తుంది. ఆ తర్వాత నన్ను ఈ కాలేజీ నుండి పంపించాలని చాలా మంది కుట్రలు చేస్తున్నారు.. నేను ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని వసుధార అంటుంది. ఆ తర్వాత వసుధర ఇన్ని రోజులకి చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణం నువ్వే మను అంటు మహేంద్ర హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర, దేవాయని ఇద్దరు వసు బర్త్ డే మను సెలబ్రేట్ చేశాడని కోపంగా ఉంటారు. వంద ప్లాన్లు చేసిన అందులో ఒక్కటి కూడా సక్సెస్ అవడం లేదని శైలంద్ర అంటాడు. అప్పుడే ధరణి కేక్ తీసుకొని వచ్చి.. తినండి అంటు వాళ్ళకి ఇస్తుంది. ధరణి తన మాటలతో వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది. కాసేపటికి మీరు వసుధార బర్త్ డే సెలబ్రేట్ చేసినట్టు మీ బర్త్డే కూడా చేస్తాం.. మీ బర్త్ డే ఎపుడో చెప్పండంటు మనుని ఏంజిల్ అడుగుతుంది. దాంతో అనుపమ వంక మను చూస్తుంటాడు.

నీకెందుకు ఏంజెల్ అంటు తనపైన అనుపమ కోప్పడుతుంది. ఇప్పుడు నేనేం అన్నానని అంత సీరియస్ అవుతున్నావని అనుపమతో ఏంజెల్ అంటుంది. నా బర్త్ డే నాకు తెలియదు.. నా గతాన్ని నేను మర్చిపోయానని మను అంటాడు. నువు మర్చిపోయింది గుర్తుకు చెయ్యడానికే నేను ఉన్నను.. నీ బర్త్ డే ఎప్పుడో నేను కనిపెడుతానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి ఫోటోని వసుధార చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మనుకి రాజీవ్ ఎదురుపడి.. ఎందుకు వసుధార విషయంలో.. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావని అనగానే.. నీలాంటి మృగాల బారినుండి కాపాడడానికి అని మను అంటాడు. ఇద్దరు కోపంగా ఒకరికొకరు కాలర్ పట్టుకొని గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ‌

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.