English | Telugu
కుల్ఫీతో అనసూయ.. మరోసారి నెటిజన్ల ఘాటు కామెంట్లు!
Updated : Mar 14, 2024
అనసూయ ప్రస్తుతం తెలుగు యాంకరింగ్ లో దూసుకెళ్తోంది. అటు సినిమాలు, ఇటు షోలతో క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే కొన్ని ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మరిన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.
కుల్ఫీతో దిగిన నాలుగు ఫోటోలని అనసూయ అప్లోడ్ చేయగా.. అందులో రెండు, నాలుగు ఫోటోలు కాస్త బోల్డ్ లుక్స్ ఉండేసరికి ఇన్ స్ట్రాగ్రామ్ లో ఉండే కరువు బ్యాచ్ అంతా హాజరయ్యి మరీ తమ
నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్, ఐ హేట్ మైండ్, సెగ పుట్టిస్తుంది.. అది జస్ట్ కుల్ఫీ గాయ్స్.. ఆ నాలుగో ఫోటోల ఏదో తేడాగా ఉందే అంటూ ఇంకా చాలా దారుణమైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అయితే అసూయని గతంలో ఆంటీ అని ఓ నెటిజన్ అన్నందుకే నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య గోవాకి ఫ్యామిలీతో వెళ్ళి.. తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా అదే రేంజ్ లో హైలైట్ అవుతున్నాయి.
రంగస్థలంలో రంగమత్తగా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. రంగమార్తండ, విమానం సినిమాలో తన క్యారెక్టర్ ని ఎలవేట్ చేస్తూ సీన్స్ రావడంతో తనలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందంటు నిరూపించుకుంది. అయితే తను నటించిన 'రజాకర్ ' మూవీ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అనసూయకి ఇన్ స్టాగ్రామ్ లో 1.4మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రజాకర్ ట్రెండింగ్ నెంబర్ వన్ లో కొనసాగుతుంది అంటు అనసూయ మరో పోస్ట్ చేసింది. అయితే అ పోస్ట్ కంటే ఈ కుల్ఫీతో తను దిగిన ఫోటోనే మరింత ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ ఫోటోలకి వస్తున్న నెగెటివ్ కామెంట్లని తను ఎలా తిప్పికొడుతుందో చూడాలి మరి.